భారత ఎన్నికల సంఘం
2024 లోక్‌సభ ఎన్నికల 5వ దశలో 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల బరిలో నిలిచిన 695 మంది అభ్యర్థులు
5వ దశ ఎన్నికలు జరుగుతున్న 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంటు నియోజకవర్గాల్లో దాఖలైన 1586 నామినేషన్లు
Posted On:
08 MAY 2024 2:46PM by PIB Hyderabad
2024 లోక్‌సభ ఎన్నికల ఐదో దశ ఎన్నికలలో పోటీ చేసేందుకు 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుండి 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఐదో దశలో ఎన్నికలు జరుగుతున్న 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ స్థానాల కోసం మొత్తం 1586 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఐదవదశ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ మే 3, 2024. దాఖలు చేసిన అన్ని నామినేషన్ల పరిశీలన తర్వాత 749 నామినేషన్లు చెల్లుబాటు అయ్యేవిగా గుర్తించబడ్డాయి.
ఫేజ్-5లో మహారాష్ట్రలోని 13 పార్లమెంటరీ నియోజకవర్గాలకు గరిష్టంగా 512 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో 14 పార్లమెంటు నియోజకవర్గాలకు 466 నామినేషన్లు వచ్చాయి. జార్ఖండ్‌లోని 4-ఛత్రా పార్లమెంటరీ నియోజకవర్గానికి గరిష్టంగా 69 నామినేషన్లు దాఖలయ్యాయి. తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్‌లోని 35-లక్నోకు 67 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. 5వ దశ ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థుల సగటు సంఖ్య 14.
2024 లోక్‌సభ ఎన్నికల 5వ దశకు సంబంధించిన రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల వారీ వివరాలు:
రాష్ట్రం/కేంద్ర పాలితప్రాంతం - ఐదోదశలో నియోజకవర్గాల సంఖ్య - దాఖలైన నామినేషన్లు - పరిశీలన అనంతరం మిగిలిన అభ్యర్థులు - ఉపసంహరణ అనంతరం మిగిలిన అభ్యర్థులు
బిహార్ 5 164 82 80
జమ్ము కశ్మీర్ 1 38 23 22
జార్ఖండ్ 3 148 57 54
లడక్ 1 8 5 3
మహారాష్ట్ర 13 512 301 264
ఒడిశా 5 87 41 40
ఉత్తరప్రదేశ్ 14 466 147 144
పశ్చిమ బెంగాల్ 7 163 93 88
మొత్తం 49 1586 749 695
***
(Release ID: 2020087)
Visitor Counter : 178
Read this release in:
Kannada
,
Malayalam
,
Assamese
,
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil