ప్రధాన మంత్రి కార్యాలయం

సిలిగుడి లో జరిగిన ‘వికసిత్ భారత్, వికసిత్ వెస్ట్ బెంగాల్’ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 09 MAR 2024 6:38PM by PIB Hyderabad

పశ్చిమ బంగాల్ యొక్క గవర్నరు శ్రీ సి.వి. ఆనంద బోస్ గారు, మంత్రిమండలి లో నా సహచరులు శ్రీ నిసిథ్ ప్రమాణిక్ గారు, శ్రీ జాన్ బార్‌ లా గారు, పశ్చిమ బంగాల్ లో ప్రతిపక్ష నేత శ్రీ సువేందు అధికారి గారు, పార్లమెంటు లో నా సహచరుడు శ్రీ సుకాంత్ మజూమ్‌దార్ గారు, దేబశ్రి చౌధరి గారు, ఖగెన్ ముర్ము గారు, రాజు బిస్తా గారు, డాక్టర్ శ్రీ జయంత కుమార్ రాయ్ గారు, శాసన సభ్యులు, ఇతర మహానుభావులు, మహిళలు మరియు సజ్జనులారా.

 

ప్రాకృతిక శోభ కు మరియు తేయాకు తోటల కు ప్రసిద్ధం అయినటువంటి ఉత్తర బంగాల్ కు రావడం నాకు చాలా సంతోషకరమైన అనుభూతి ని ఇచ్చింది. ఈ రోజు న ఇక్కడ వందల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పథకాల ను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన జరిగింది. ఇది వికసిత్ బంగాల్ ఆవిష్కారం దిశ లో మరొక ముఖ్యమైన అడుగు. నేను ఈ అభివృద్ధి కార్యక్రమాల కు గాను బంగాల్ యొక్క ప్రజల కు, ప్రత్యేకించి ఉత్తర బంగాల్ లోని ప్రజల కు నా యొక్క అభినందనల ను తెలియ జేస్తున్నాను.

 

మిత్రులారా,

ఉత్తర బంగాల్ లోని ఈ ప్రాంతం మన ఈశాన్య ప్రాంత రాష్ట్రాల కు ఒక ప్రవేశద్వారం గా ఉంది, అంతేకాక ఇరుగు పొరుగు దేశాల తో వ్యాపారం తాలూకు మార్గాలు కూడా ఇక్కడి నుండి వెళ్తున్నాయి. ఈ కారణం గా, గడచిన పది సంవత్సరాల లో బంగాల్ యొక్క అభివృద్ధి, మరీ ముఖ్యం గా బంగాల్ ఉత్తర ప్రాంతం యొక్క అభివృద్ధి మా ప్రభుత్వం యొక్క ప్రాథమ్యాల లో ఒకటిగా ఉంటూ వచ్చింది. ఉత్తర బంగాల్ శీఘ్ర అభివృద్ధి కోసం ఈ ప్రాంతం లో ఇరవై ఒకటో శతాబ్ది అవసరాల కు తగినట్లుండే రైలు మార్గాలు మరియు రహదారి మార్గాల సంబంధి మౌలిక సదుపాయాల ను నిర్మించడం అత్యవసరం. ఈ దృష్టికోణాన్ని అనుసరించి ఏక్ లాఖీ నుండి బాలుర్ ఘాట్ , సిలిగుడి నుండి ఆలువాబాడీ, మరి రాణి నగర్- జల్‌పాయీగుడి- హల్దీబాడి ల మధ్య రైలు లైనుల విద్యుతీకరణ కార్యం పూర్తి అయింది. దీనితో ఉత్తర దినాజ్ పుర్, దక్షిణ్ దినాజ్ పుర్, కూచ్ బిహార్, జల్‌పాయీగుడి ల వంటి జిల్లాల లో రైళ్ళ ప్రయాణ వేగం పెరగనుంది. సిలిగుడి-సాముక్ తలా రూట్ యొక్క విద్యుదీకరణ ఆ ప్రాంతం చుట్టుప్రక్కల ఉన్న అడవులు మరియు వన్య ప్రాణి నిలయాల లో కాలుష్యం తగ్గుతుంది. ఈ రోజు న బార్ సోయీ - రాధికాపుర్ సెక్శన్ యొక్క విద్యుదీకరణ కూడా పూర్తి అయిపోయింది. దీని వల్ల ఒక్క పశ్చిమ బంగాల్ కే కాకుండా బిహార్ యొక్క ప్రజల కు కూడా మేలు జరుగుతుంది. రాధికాపుర్ నుండి సిలిగుడీ మధ్య ఒక క్రొత్త రైలు సేవ మొదలైంది. బంగాల్ లో ఈ విధమైన రైలు సంబంధి పటిష్ట మౌలిక సదుపాయాలు క్రొత్త క్రొత్త అభివృద్ధి అవకాశాల కు బాట ను పరచడం తో పాటు సామాన్య ప్రజానీకానికి జీవన నాణ్యత ను మెరుగు పరుస్తాయి.

 

మిత్రులారా,

రైళ్ళు ఈశాన్య ప్రాంత రాష్ట్రాల లోకి అడుగుపెట్టాయి అంటేనే ఆ రైళ్ల వేగం నెమ్మదించినటువంటి కాలం అంటూ ఒకటి ఉండింది. అయితే, మా ప్రభుత్వం దేశం లోని ఇతర ప్రాంతాల లో వలెనే ఉత్తర బంగాల్ లోనూ రైళ్ళ వేగాన్ని పెంచడానికి పాటుపడుతోంది. ప్రస్తుతం ఉత్తర బంగాల్ నుండి బాంగ్లాదేశ్ కు సైతం రైలు మార్గ సంధానం మొదలైపోయింది. న్యూ జల్‌పాయీగుడి నుండి ఢాకా కంటోన్మెంట్ వరకు మితాలి ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణిస్తోంది. రాధికాపుర్ స్టేశన్ వరకు కనెక్టివిటీ ని బాంగ్లాదేశ్ యొక్క ప్రభుత్వం తో కలసి మేం పెంచుతున్నాం. ఈ నెట్ వర్క్ బలపరడడం తో, ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థ లకు మరియు ఈ ప్రాంతం లో పర్యటన రంగాని కి చాలా ప్రోత్సాహం అందనుంది.

 

మిత్రులారా,

స్వాతంత్య్రం అనంతరం చాలా కాలం పాటు భారతదేశం లోని తూర్పు ప్రాంతాల అభివృద్ధి అన్ని ఆ ప్రాంతాల హితాల ను గురించి పట్టించుకోవడం అన్నా చిన్న చూపే ఉండింది. ఏమైనప్పటికీ, మా ప్రభుత్వం భారతదేశం లోని తూర్పు రాష్ట్రాలు దేశాభివృద్ధి కి చోదక శక్తి అనే అభిప్రాయాన్ని కలిగివుండి పని చేస్తోంది. ఈ కారణం గా ఈ ప్రాంతం లో కనెక్టివిటీ రంగం లో ఇదివరకు ఎరుగని విధం గా పెట్టుబడుల ను పెట్టడం జరుగుతోంది. 2014 వ సంవత్సరాని కి పూర్వం బంగాల్ లో రైలు రంగ సగటు బడ్జెటు సుమారు 4,000 కోట్ల రూపాయలు ఉండగా ప్రస్తుతం దాదాపు 14,000 కోట్ల రూపాయలు అయింది. ఉత్తర బంగాల్ నుండి గువాహాటీ కి, ఇంకా హావ్‌ డా కు సెమి-హై-స్పీడ్ తరహా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. సిలిగుడి స్టేశన్ ను ‘అమృత్ భారత్ స్టేశన్ పథకం’ లో చేర్చడమైంది. 500 కు పైగా రైల్ వే స్టేశన్ లను ఆధునికం గా తీర్చిదిద్దాలి అనేది అమృత్ భారత్ స్టేశన్ పథకం లక్ష్యం. ఈ పది సంవత్సరాల లో మేం బంగాల్ మరియు ఈశాన్య ప్రాంత రాష్ట్రాల లో రైళ్ళ వేగాన్ని ప్యాసింజర్ స్థాయి నుండి ఎక్స్ ప్రెస్ స్థాయి కి పెంచాం. మా మూడో పదవీ కాలం లో రైళ్ళు సూపర్ ఫాస్ట్ వేగాన్ని అందుకొంటాయి.

 

 

మిత్రులారా,

మూడు వేల కోట్ల రూపాయల కు పైచిలుకు విలువ కలిగిన రహదారి ప్రాజెక్టుల ను ఉత్తర్ బంగాల్ లో ఈ రోజు న ప్రారంభించడమైంది. నాలుగు దోవల తో ఉండే ఘోష్ పుకుర్-ధుప్ గుడీ సెక్శను మరియు ఇస్లామ్ పుర్ బైపాస్ లు ప్రారంభం కావడం తో అనేక జిల్లాల లో ప్రజల కు మేలు జరుగనుంది. జల్ పాయీగుడి, సిలిగుడి, ఇంకా మైనాగుడి ల వంటి పట్టణ ప్రాంతాలు ట్రాఫిక్ రద్దీ నుండి బయట పడనున్నాయి. ఇది ఉత్తర్ బంగాల్ లో సిలిగుడి, జల్ పాయీగుడి, అలీపుర్ ద్వార్ జిల్లాల తో పాటు యావత్తు ఈశాన్య ప్రాంతం లో మెరుగైన రోడ్ కనెక్టివిటీ ని సమకూర్చనుంది. దువార్స్, దార్జీలింగ్, గంగ్ టోక్ మరియు మిరిక్ ల వంటి పర్యటన ప్రధానమైన కేంద్రాల కు చేరుకోవడం సులభ తరం కానుంది. అంటే ఈ ప్రాంతం లో పర్యటన రంగం వర్దిల్లుతుంది. పరిశ్రమలు అధికం అవుతాయి, మరి తేయాకు రైతులు లాభపడతారు అన్న మాట.

 

మిత్రులారా,

పశ్చిమ బంగాల్ యొక్క అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేతనైన ప్రతి ప్రయాస ను చేస్తోంది. అభివృద్ధి ప్రాజెక్టుల కు గాను మరొక్కసారి నేను అభినందనల ను తెలియ జేస్తున్నాను. మీకు ఇవే అనేకానేక ధన్యవాదాలు. ఇక్కడ ఒక కార్యక్రమం ముగుస్తూ ఉంటే, నా ఉపన్యాసమేమో ముగియ లేదు. అది కొనసాగుతుంది. ఈ కారణం గా, నేను ఇక్కడ నుండి బయలుదేరి బహిరంగ ప్రదేశానికి వెళుతున్నాను. మీ అందరిని అక్కడ కలుసుకొని, అరమరికల కు తావు ఇవ్వకుండా మాట్లాడుతాను.

 

మీకు అనేకానేక ధన్యవాదాలు.

 

 

అస్వీకరణ: ఇది ప్రధాన మంత్రి ప్రసంగానికి భావానువాదం. సిసలు ఉపన్యాసం హిందీ భాష‌ లో సాగింది.

 

 

 

***



(Release ID: 2017967) Visitor Counter : 28