భారత ఎన్నికల సంఘం

2024 సార్వత్రిక ఎన్నికల సమాచారం కోసం మీడియా ఫెసిలిటేషన్ పోర్టల్ ప్రారంభించిన పీఐబీ

Posted On: 27 MAR 2024 10:40AM by PIB Hyderabad

2024 సార్వత్రిక ఎన్నికల సమాచారం కోసం మీడియా ఫెసిలిటేషన్ పోర్టల్ ను పీఐబీ ప్రారంభించింది.

2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన  పూర్తి సమాచారం, వివరాలు మీడియా ప్రతినిధులకు అందించడం కోసం అనేక సౌకర్యాలతో  వన్ స్టాప్ ఫెసిలిటేషన్ పోర్టల్ గా https://pib.gov.in/elect2024/index.aspx   మైక్రో సైట్ ను  ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రారంభించింది. పోర్టల్ ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంది.

1. డిజిటల్ ఫ్లిప్ బుక్: ఇందులో వివిధ ఆసక్తికరమైన విశ్లేషణలు, పూర్తి సమాచారంతో కదనాలు  ఉన్నాయి. మీడియా ప్రతినిధులు తమ వ్యాసాలు రాయడానికి ఈ సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు.

 

2. ఈసీఐ వెబ్ సైట్ కు చెందిన  సంబంధిత విభాగాలను  పాత్రికేయులు సందర్శించడానికి వీలుగా   ఉపయోగకరమైన లింకులు పొందుపరిచారు.

3. సమాచారాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి వీలు కల్పించేవివిధ ఇన్ఫోగ్రాఫిక్స్ రిఫరెన్స్ లు అందుబాటులో ఉంటాయి.

4. సార్వత్రిక ఎన్నికలు  2024  వివిధ దశల వివరాలు పొందుపరిచారు. 

5.ఈసీఐ జారీ చేసే  నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తాజాగా  అప్లోడ్ చేస్తారు.

 

6. ఈఏఎస్ సహా జాతీయ, రాష్ట్ర స్థాయి ఈసీఐ అధికారుల పూర్తి  సమాచారం

అందుబాటులో ఉంచారు. 

 

7. మీడియా గైడ్ తో సహా సూచనలతో కూడిన ఈసీఐ సంకలనాన్ని అందుబాటులో ఉంచారు

8. తాజా పరిణామాలను మీడియా ప్రతినిధులకు అందించడానికి ఏర్పాట్లు చేశారు.

 

***



(Release ID: 2016528) Visitor Counter : 104