ప్రధాన మంత్రి కార్యాలయం

అధ్యక్షుడు శ్రీ పుతిన్ కు, ఆయన తిరిగి ఎన్నికైనందుకుఅభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


భారతదేశం-రశ్యా లప్రత్యేకమైన మరియు విశేషాధికారాల తో కూడిన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గాపటిష్టపరచుకోవాలని నేతలు అంగీకరించారు

వారు ద్వైపాక్షికసహకారం లో పురోగతి ని సమీక్షించడం తో పాటు ప్రాంతీయ అంశాల పైన మరియు ప్రపంచ అంశాలపైన అభిప్రాయాల ను తెలియ జెప్పుకొన్నారు

రశ్యా-యూక్రేన్ ఘర్షణ లో చర్చ, దౌత్యం ల దారి లో ముందుకు సాగాలని పునరుద్ఘాటించినప్రధాన మంత్రి 

Posted On: 20 MAR 2024 3:33PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రశ్యన్ ఫెడరేశన్ యొక్క అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.

రశ్యన్ ఫెడరేశన్ కు అధ్యక్షుని గా శ్రీ పుతిన్ మళ్ళీ ఎన్నిక కావడం తో ఆయన కు అభినందనల ను ప్రధాన మంత్రి తెలియ జేశారు. స్నేహశీలురైన రశ్యా యొక్క ప్రజల కు శాంతి, ప్రగతి మరియు సమృద్ధి కలగాలంటూ ఆయన తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

రాబోయే సంవత్సరాల లో ఈ దేశాల మధ్య ప్రస్తుతం అమలవుతున్న ప్రత్యేకమైన మరియు విశేషాధిరాల తో కూడిన వ్యూహాత్మ భాగస్వామ్యాన్ని మరింత గా బలపరచే దిశ లో కలిసికట్టుగా ప్రయత్నిద్దాం అంటూ నేత లు ఇద్దరు వారి యొక్క అంగీకారాన్ని వ్యక్తం చేశారు.

 

వారు ద్వైపాక్షిక సహకారాని కి సంబంధించిన వివిధ అంశాల లో చోటుచేసుకొన్న పురోగతి ని సమీక్షించడం తో పాటు పరస్పర హితం ముడిపడిన ప్రాంతీయ అంశాల పట్ల మరియు ప్రపంచ అంశాల పట్ల వారి యొక్క అభిప్రాయాల ను కూడా ఒకరి కి మరొకరు తెలియ జేసుకొన్నారు.

ప్రధాన మంత్రి రశ్యా-యూక్రేన్ సంఘర్షణ ను గురించి చర్చిస్తూ, చర్చ మరియు దౌత్యం ల మాధ్యం ద్వారా ముందుకు సాగాలి అనే భారతదేశం పదే పదే చెబుతూ వస్తోంది అని పునరుద్ఘాటించారు.

ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుకొంటూ ఉండాలి అని ఇద్దరు నేత లు అంగీకరించారు.

 

***



(Release ID: 2015742) Visitor Counter : 72