ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రసిద్ధ గాయకుడు శ్రీ పంకజ్ ఉధాస్ కన్నుమూత పట్ల దుఃఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
26 FEB 2024 7:08PM by PIB Hyderabad
ప్రసిద్ధ గాయకుడు శ్రీ పంకజ్ ఉధాస్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢమైన దుఃఖాన్ని వ్యక్తం చేశారు. శ్రీ పంకజ్ ఉధాస్ గారి తో శ్రీ నరేంద్ర మోదీ విభిన్న సందర్భాల లో జరిపిన మాటామంతీ ని గుర్తు కు తెచ్చుకొంటూ, శ్రీ పంకజ్ ఉధాస్ గారు భారతీయ సంగీతాని కి ఒక దారి దీపం గా నిలచారు; ఆయన పాడిన మధుర గీతాలు తరాల తరబడి రంజింపచేస్తూ వస్తున్నాయి. ఆయన మనలను వీడి వెళ్లిపోవడం తో సంగీత ప్రపంచం లో ఏర్పడ్డ శూన్యాన్ని భర్తీ చేయడం ఎన్నటికీ సాధ్య పడదు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘శ్రీ పంకజ్ ఉధాస్ గారు మరణించారని తెలిసి దు:ఖిస్తున్నాను. ఆయన పాటలు అనేకమైన భావోద్వేగాల ను వ్యక్తం చేసేవి; ఆయన గజళ్ళు నేరు గా శ్రోతల మనస్సులను తాకేసేవి. ఆయన భారతీయ సంగీతాని కి ఒక ప్రకాశ స్తంభం లా ఉండే వారు, ఆయన గానం అనేక తరాల ను ప్రభావితం చేశాయి. నేను ఆయన తో నేను జరిపిన మాటామంతీ ఏళ్ళ తరబడి నా జ్ఞాపకాల లో ఉండిపోయింది.
పంకజ్ ఉధాస్ నిష్క్రమణ తో సంగీత ప్రపంచం లో ఎన్నటికీ భర్తీ చేయలేనటువంటి శూన్యమొకటి ఏర్పడింది. ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను అభిమానించే వారి కి ఇదే సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 2009494)
आगंतुक पटल : 128
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam