ప్రధాన మంత్రి కార్యాలయం
అయిదు వందలటెస్ట్ వికెట్ లను తీసుకొన్నందుకు క్రికెట్ క్రీడాకారుడు శ్రీ రవిచంద్రన్ అశ్విన్కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
16 FEB 2024 8:37PM by PIB Hyderabad
అయిదు వందల టెస్ట్ వికెట్ లను తీసుకొన్న కార్యసాధన కు గాను భారతదేశం క్రికెట్ క్రీడాకారుడు శ్రీ రవిచంద్రన్ అశ్విన్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అభినందించారు.
శ్రీ అశ్విన్ యొక్క అసాధారణమైన క్రీడా ప్రయాణం మరియు కార్యసాధన లు ఆయన ఉత్కృష్టమైనటువంటి నైపుణ్యానికి, ఇంకా దృఢ సంకల్పాని కి చక్కని ప్రమాణం గా నిలుస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -
‘‘అయిదు వందల టెస్ట్ వికెట్ లను సాధించిన అసాధారణమైన మైలురాయి ని చేరుకొన్న సందర్భం లో శ్రీ రవిచంద్రన్ అశ్విన్ కు ఇవే అనేకానేక అభినందన లు. ఆయన యొక్క అసాధారణమైనటువంటి క్రీడా యాత్ర మరియు ఆయన యొక్క కార్యసాధన లు ఆయన లోని ఉత్కృష్ట నైపుణ్యానికి, ఇంకా దృఢ సంకల్పాని కి చక్కనైన ప్రమాణం గా ఉన్నాయి. ఆయన మరిన్ని శిఖరాల ను అధిరోహించాలి అంటూ ఆయన కు నేను నా తరఫు న శుభాకాంక్షల ను తెలియజేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/RT
(Release ID: 2006956)
Visitor Counter : 115
Read this release in:
Kannada
,
Tamil
,
Malayalam
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati