ఆర్థిక మంత్రిత్వ శాఖ
ప్రజలు తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు అధిక వృద్ధితో ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, విస్తరించేందుకు తగిన పరిస్థితులను సృష్టించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
యువతలోని వ్యవస్థాపక ఆకాంక్షలను నెరవేరుస్తున్న పిఎం ముద్ర యోజన, ఫండ్ ఆప్ ఫండ్స్, స్టార్టప్ ఇండియా, స్టార్టప్ రుణ హామీ పథకాలుః కేంద్ర ఆర్ధిక మంత్రి
Posted On:
01 FEB 2024 12:32PM by PIB Hyderabad
ప్రజలు తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు అధిక వృద్ధితో ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు, విస్తరించేందుకు తగిన పరిస్థితులను సృష్టించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గురువారం పార్లమెంటులో మధ్యంతర కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పిస్తూ కేంద్ర ఆర్ధిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ పై వ్యాఖ్యలు చేశారు.
కర్తవ్య కాల్‌గా అమృత కాల్
దీనిని కర్తవ్యకాల ప్రారంభంగా సంబోధిస్తూ, భారత గణతంత్ర 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాన మంత్రి మోడీ, దేశం అపారమైన సంభావ్యతలు, అవకాశాలకు ద్వారాలు తెరుస్తున్న సమయంలో కొత్త ప్రేరణలు, నూతన చైతన్యం, నవీన తీర్మానాలతో దేశ అభివృద్ధికి మేం కట్టుబడి ఉంటాం అన్న మాటలను శ్రీమతి సీతారామన్ ఉదహరించారు.
యువత వ్యవస్థాపక ఆకాంక్షలకు ద్వారాలు తెరవడం
ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రూ. 22.5 లక్షల కోట్ల మొత్తంతో 43 కోట్ల రుణాలను కేటాయించి, యువతలోని వ్యవస్థాపక ఆకాంక్షలకు ద్వారా తెరిచామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. దీనితో పాటుగా, ఫండ్ ఆప్ ఫండ్స్, స్టార్టప్ ఇండియా, స్టార్టప్ రుణ హామీ పథకాలు యువతకు సహాయాన్ని అందిస్తుండగా, వారు కూడా రోజ్‌గార్ దాతలు (యజమానులు) అవుతున్నారు.
***
(Release ID: 2001606)
Visitor Counter : 250
Read this release in:
Urdu
,
Gujarati
,
Tamil
,
Kannada
,
English
,
Marathi
,
Assamese
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Malayalam