ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నూతన సాంకేతిక రంగంలో ప్రైవేటు పెట్టుబడులు ప్రోత్సహించడానికి లక్ష కోట్ల కార్పస్ ఏర్పాటును ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి


సాంకేతిక పరిజ్ఞానం కి ప్రాధాన్యత ఇస్తున్న యువతకు ఇదొక స్వర్ణయుగం: శ్రీమతి నిర్మలా సీతారామన్
50 సంవత్సరాల వడ్డీ లేని నిధిగా కార్పస్ ఏర్పాటు

రక్షణ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని ఎక్కువ చేసి ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు నూతన పథకం వీలు కల్పిస్తుంది.. శ్రీమతి నిర్మలా సీతారామన్

ప్రజలు, వాణిజ్య రంగం పై కొత్త తరం సాంకేతిక పరిజ్ఞానం, డేటా ప్రభావం చూపిస్తాయి... ఆర్థిక మంత్రి

Posted On: 01 FEB 2024 12:52PM by PIB Hyderabad

నూతన సాంకేతిక రంగంలో  ప్రైవేటు పెట్టుబడులు ప్రోత్సహించడానికి లక్ష కోట్ల కార్పస్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను   ప్రభుత్వం పరిశీలిస్తోంది. నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగానికి  ప్రాధాన్యత ఇస్తున్న యువతను ప్రోత్సహించడానికి ప్రభుత్వ నిర్ణయం ఉపయోగపడుతుందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి  నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.ఈరోజు పార్లమెంట్ లో  ప్రవేశపెట్టిన 2024-25 ఆర్థిక సంవత్సరం తాత్కాలిక బడ్జెట్ లో శ్రీమతి నిర్మలా సీతారామన్ నూతన పథకాన్ని ప్రతిపాదించారు.  

వడ్డీ లేని రుణంతో 50 సంవత్సరాల  కార్పస్ ఫండ్  ఏర్పాటు చేస్తారు. ఇది దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ లేదా రీ  ఫైనాన్సింగ్ కోసం  దీర్ఘకాలిక కాలపరిమితి, తక్కువ లేదా సున్నా వడ్డీ రేట్లతో రుణాలు  అందిస్తుంది.
' ప్రైవేటు రంగంలో నూతన సాంకేతిక రంగాలలో  పరిశోధనలు, ఆవిష్కరణలు సాధించడానికి  ఇది ప్రైవేటు పెట్టుబడులు  ప్రోత్సహిస్తుంది. దేశాభివృద్ధికి  యువత, సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించే కార్యక్రమాలు అవసరం' అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
రక్షణ అవసరాల కోసం డీప్ టెక్ టెక్నాలజీని బలోపేతం చేయడానికి, వేగంగా  'ఆత్మ నిర్బర్ భారత్  ' సాధించడానికి పథకం ఉపయోగపడుతుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 
సాంకేతిక మార్పులు
 ప్రజలు, వ్యాపార రంగంలో  నూతన  తరం  సాంకేతిక పరిజ్ఞానం , డేటా సమూల మార్పులు తీసుకు వస్తున్నాయని శ్రీమతి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.నూతన  ఆర్థిక అవకాశాలను తీసుకు వస్తున్నా మార్పులు సమాజంలో అట్టడుగున  ఉన్న వాటితో సహా అందరికీ సరసమైన ధరలలో అధిక-నాణ్యత సేవలను అందించడానికి వీలు కల్పిస్తున్నాయి అని  ఆర్థిక మంత్రి అన్నారు.
ప్రపంచ స్థాయిలో భారత్ కు అవకాశాలు లభిస్తున్నాయని  పేర్కొన్న నిర్మలా సీతారామన్, "భారతదేశం ఆవిష్కరణలు, వ్యవస్థాపక శక్తి  ద్వారా ప్రపంచానికి  పరిష్కారాలను చూపుతోంది" అని మంత్రి పేర్కొన్నారు. 

****

 


(Release ID: 2001449) Visitor Counter : 271