ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంటుసమావేశాలు మొదలవడాని కి పూర్వం ప్రసార మాధ్యమాల ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
‘‘రాష్ట్రపతిశ్రీమతి ద్రౌపది ముర్ము యొక్క మార్గదర్శకత్వం మరియు శ్రీమతి నిర్మల సీతారమణ్ ద్వారా మధ్యంతర బడ్జెటు సమర్పణ అనేవి నారీ శక్తి ఉత్సవ సూచికలు గా ఉండబోతున్నాయి’’
‘‘నిర్మాణాత్మకమైన విమర్శలుఆహ్వానించదగ్గవి, సభ కు అంతరాయం కలిగించేటటువంటి ప్రవర్తన అంధకారం లో మగ్గిపోతుంది’’
‘‘మన యొక్కఅత్యుత్తమమైనటువంటి అభిప్రాయాల ను వెల్లడించడాని కి, మన ఆలోచనల తో సభ ను సమృద్ధం చేయడాని కి, మరి అలాగే దేశం లో ఉత్సాహాన్ని, ఇంకా ఆశావాదాన్ని నింపడాని కి మనం పాటుపడదాం రండి’’
‘‘సాధారణం గా, ఎన్నికల కాలం దగ్గర పడుతోందంటే పూర్తి బడ్జెటు ను సమర్పించడమనేది ఉండదు, మేం కూడ అదేసంప్రదాయాన్ని అనుసరిస్తాం; క్రొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత పూర్తి బడ్జెటు ను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది’’
Posted On:
31 JAN 2024 12:04PM by PIB Hyderabad
బడ్జెటు సమావేశాలు ఆరంభం కావడాని కంటే ముందు గా ప్రసార మాధ్యాల కు ఒక ప్రకటన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, క్రొత్త పార్లమెంటు యొక్క ఒకటో సమావేశాన్ని గుర్తుకు తీసుకు వస్తూ, ఆ తొలి సమావేశం లో తీసుకొన్నటువంటి ముఖ్య నిర్ణయాన్ని గురించి ప్రముఖం గా ప్రస్తావించారు. ‘‘విమెన్ ఎమ్‌పవర్‌మెంట్ ఎండ్ ఎడ్యులేశన్ యాక్టు కు ఆమోదం లభించడం మన దేశ ప్రజల కు ఒక మహత్తరమైనటువంటి క్షణాని కి సూచిక గా నిలచింది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. జనవరి 26 వ తేదీ నాటి గణతంత్ర దినం సంబురాల ను గురించి ఆయన పేర్కొంటూ, దేశం నారీ శక్తి తాలూకు బలాన్ని, పరాక్రమాన్ని మరియు దృఢ సంకల్పాన్ని అక్కున చేర్చుకొంది అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ప్రసంగం మరియు ఆర్థిక మంత్రి నిర్మల సీతారమణ్ గారు సమర్పించబోయేటటువంటి మధ్యంతర బడ్జెటు ల ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేస్తూ, ఈ ఘటన క్రమాలు మహిళా సాధికారిత ను చాటిచెప్పే వేడుక వంటివి అంటూ అభివర్ణించారు.
గడచిన పదేళ్ళ కాలాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెబుతూ, పార్లమెంటు లో ప్రతి ఒక్క సభ్యుడి/ ప్రతి ఒక్క సభ్యురాలి తోడ్పాటు ను అంగీకరించారు. ఏమైనా ప్రజాస్వామిక విలువ ల పంథా నుండి వైదొలగి, సభ లో గలభా కు మరియు అంతరాయాని కి పాల్పడిన వారు ఆత్మశోధన చేసుకోవలసిందంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘విమర్శ మరియు ప్రతిపక్షం అనేవి ప్రజాస్వామ్యం లో అతి ముఖ్యమైనవి; అయితే, సమాజం లో పెద్ద వర్గం వారు నిర్మాణాత్మకమైనటువంటి అభిప్రాయాల తో సభ ను సమృద్ధం చేసినటువంటి వారిని జ్ఞాపకం పెట్టుకొంటుండవచ్చు. సభ కు అంతరాయాన్ని కలిగించినటువంటి వ్యక్తుల ను ఏ ఒక్కరు గుర్తు పెట్టుకోర’’ని పేర్కొన్నారు.
రాబోయే రోజుల పై ప్రధాన మంత్రి ఆశ పెట్టుకొంటూ, పార్లమెంటు లో చోటుచేసుకొనే చర్చోపచర్చల తాలూకు ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘ఇక్కడ ఆడే ప్రతి ఒక్క మాట చరిత్ర పుటల లో నమోదు అవుతుంది’’ అని ఆయన నొక్కి పలికారు. సానుకూలమైన విధం గా తోడ్పాటు ను అందించండి అంటూ సభ్యుల కు ఆయన పిలుపు ను ఇచ్చారు. ‘‘నిర్మాణాత్మకమైనటువంటి విమర్శల కు ఇదే ఆహ్వానం. సభ లో వాతావరణాన్ని భంగ పరచేటటువంటి వ్యక్తులు పత్తా లేకుండా పోతారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. బడ్జెటు సమావేశాలు ఆరంభం అవుతున్న క్రమం లో గౌరవనీయులైన సభ్యులు అందరు ఒక సకారాత్మకమైనటువంటి ప్రభావాన్ని ప్రసరింప చేయడం కోసం ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలి అని ప్రధాన మంత్రి కోరారు. జాతీయ హితాల కు పెద్ద పీట ను వేయవలసింది గా ఆయన ఉద్భోదించారు. ‘‘మనం మన అత్యుత్తమైనటువంటి ప్రయాసల కు నడుం కడదాం, మనం ఆలోచనల తో సభ ను సమృద్ధం చేద్దాం. దేశ ప్రజల లో ఉత్సాహాన్ని ఆశావాదాన్ని నింపుదాం, కలసి రండి’’ అని ఆయన అన్నారు.
త్వరలో సమర్పించనున్న బడ్జెటు విషయమై ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ‘‘ఎన్నికల కాలం దగ్గర పడుతున్న వేళ లో పూర్తి స్థాయి బడ్జెటు ను సమర్పించడం పరిపాటి కాదు, మేం సైతం అదే సంప్రదాయాన్ని అనుసరిస్తాం; క్రొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత పూర్తి బడ్జెటు ను మీ ముందుకు తీసుకు రావడం జరుగుతుంది. ఈ సారి ఆర్థిక మంత్రి నిర్మల గారు మన అందరి సమక్షం లో తన బడ్జెటు ను మార్గదర్శక అంశాల తో సహా రేపటి రోజు న సమర్పించనున్నారు’’ అని ఆయన అన్నారు.
‘‘భారతదేశం సాగిస్తున్నటువంటి సమ్మిళత అభివృద్ధి ప్రస్థానం మరియు సంపూర్ణ అభివృద్ధి యాత్ర ప్రజల యొక్క దీవెనల తో నిరంతరం గా పయనిస్తుంది’’ అని అంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.
***
(Release ID: 2000829)
Visitor Counter : 146
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Nepali
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam