ప్రధాన మంత్రి కార్యాలయం
చండీగఢ్ యూనివర్సిటీ చాన్స్‌లర్ శ్రీ సత్‌నామ్ సింహ్ సంధూను రాజ్య సభ కు భారతదేశ రాష్ట్రపతి నామినేట్ చేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసినప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
30 JAN 2024 1:20PM by PIB Hyderabad
చండీగఢ్ యూనివర్సిటీ చాన్స్‌లర్ శ్రీ సత్‌నామ్ సింహ్ సంధూ ను రాజ్య సభ కు భారతదేశ రాష్ట్రపతి నామినేట్ చేయడం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘శ్రీ సత్‌నామ్ సింహ్ సంధూ గారి ని రాష్ట్రపతి గారు రాజ్య సభ కు నామినేట్ చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. సత్‌నామ్ గారు స్వయానా ఒక ప్రముఖ విద్యావేత్త మరియు సామాజిక కార్యకర్త గా పేరు తెచ్చుకొన్నారు. క్షేత్ర స్థాయి లో ఆయన విభిన్నమైన మార్గాల లో ప్రజల కు సేవలను అందిస్తున్నారు. జాతీయ అఖండత ను పెంపొందింప చేయడం కోసం ఆయన విస్తృతం గా పాటుపడ్డారు. దీనికి తోడు, ఆయన విదేశాల లో స్థిరపడ్డ భారతీయ సముదాయాని కి కూడాను సహకారాన్ని అందజేశారు. ఆయన యొక్క పార్లమెంటరీ ప్రస్థానం లో అత్యుత్తమమైన ఫలితాలు దక్కాలి అంటూ ఆయన కు శుభాకాంక్షల ను తెలియ జేస్తున్నాను, మరి రాజ్యసభ కార్యకలాపాలు ఆయన వ్యక్తం చేసే అభిప్రాయాల ద్వారా సుసంపన్నం అవుతాయన్న విశ్వాసం నాలో ఉంది. @satnamsandhuchd” అని పేర్కొన్నారు.
**********
DS/ST
(रिलीज़ आईडी: 2000619)
आगंतुक पटल : 176
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam