ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ కర్పూరీఠాకుర్ కు భారత్ రత్న ను ఇవ్వాలనే నిర్ణయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
Posted On:
23 JAN 2024 9:05PM by PIB Hyderabad
సామాజిక న్యాయం యొక్క పథనిర్ణేత శ్రీ కర్పూరీ ఠాకుర్ కు భారత్ రత్న ను ఇవ్వాలన్న నిర్ణయం ఆయన మరణానంతరం తాజా గా వెలువడడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
కర్పూరీ ఠాకుర్ గారి శత జయంతి తాలూకు సందర్భం లో ఈ నిర్ణయం దేశప్రజల ను గౌరవాన్వితులను గా చేయగలదు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. వెనుకబడిన వర్గాల వారు మరియు వంచన కు గురి అయిన వర్గాల వారి అభ్యున్నతి కోసం శ్రీ కర్పూరీ ఠాకుర్ చాటిచెప్పిన అచంచల నిబద్ధత మరియు దూరదర్శి నాయకత్వం లు భారతదేశం యొక్క సామాజిక-రాజకీయ యవనిక పై చెరిపివేయలేనటువంటి ముద్ర ను వేసింది.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశంలో -
‘‘సామాజిక న్యాయం యొక్క పథ ప్రదర్శకుడు మహనీయుడైన జన్ నాయక్ కర్పూరీ ఠాకుర్ గారి కి భారత్ రత్న సమ్మానాన్ని కట్టబెట్టాలన్న నిర్ణయాన్ని భారతదేశం ప్రభుత్వం తీసుకొన్నదన్న విషయం, అది కూడాను ఆయన యొక్క శత జయంతి వేళ లో ఈ నిర్ణయం వెలువడడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఆయన శత జయంతి సందర్భం లో ఈ నిర్ణయం దేశ ప్రజల ను గౌరవాన్వితులను గా చేస్తుంది. ఆదరణ కు నోచుకోకుండా మిగిలిపోయిన వర్గాల వారి పక్షాన సమానత్వం, ఇంకా సశక్తీకరణ ల దృఢసంకల్పం తో పోరాడిన ఒక విజేత కు మరియు ఆయన జరిపినటువంటి సహనశీల ప్రయాసల కు ఒక నిదర్శన గా ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి గుర్తింపు ఉన్నది.
వెనుకబడిన వర్గాల వారు మరియు వంచన కు గురి అయిన వర్గాల వారి అభ్యున్నతి కోసం శ్రీ కర్పూరీ ఠాకుర్ చాటిచెప్పిన అచంచల నిబద్ధత మరియు దూరదర్శి నాయకత్వం లు భారతదేశం యొక్క సామాజిక-రాజకీయ యవనిక పై చెరిపివేయలేనటువంటి ముద్ర ను వేసింది. ఈ పురస్కారం ఆయన యొక్క ప్రశంసనీయమైనటువంటి తోడ్పాటుల ను గౌరవించుకోవడం ఒక్కటే కాకుండా మరింత న్యాయవంతం అయినటువంటి మరియు సమాన అవకాశాల ను ప్రసాదించేటటువంటి ఒక సమాజాన్ని ఏర్పరచాలి అనే ఆయన ఆశయాల సాధన బాట లో మనం మునుముందుకు సాగిపోయేటందుకు మనకు ప్రేరణ ను ఇవ్వగలదు.” అని పేర్కొన్నారు.
(Release ID: 1999579)
Visitor Counter : 120
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam