ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ధనుష్కోడిలోని కోదండరామ దేవాలయంలో పూజలు నిర్వహించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 21 JAN 2024 3:41PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధనుష్కోడిలోని కోదండరామస్వామి దేవాలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు. ఈ దేవాలయం పూర్తిగా కోదండరామస్వామికే  అంకితం అయింది. కోదండరామ అంటే విల్లు పట్టుకున్న రాముడు. ధనుష్కోడి అనే ప్రదేశంలో ఈ దేవాలయం ఉంది. విభీషణుడు తొలి సారి శ్రీరాముని కలిసి శరణు కోరిన ప్రదేశంగా దీన్ని చెబుతారు. విభీషణునికి శ్రీరాములవారు పట్టాభిషేకం చేసిన ప్రదేశం ఇది అని కొందరు చెబుతారు.

ప్రధానమంత్రి ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ

“ప్రసిద్ధ కోదండరామస్వామి దేవాలయంలో ప్రార్థనలు చేశాను. అద్భుతమైన ఆశీస్సులు అందినట్టు భావిస్తున్నాను” అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1998530) आगंतुक पटल : 149
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam