ప్రధాన మంత్రి కార్యాలయం
‘ప్రస్తుతం రైతులు తమ కు అండ లభిస్తుంది అనే భావన తో ఉన్నారు’ అని ప్రధాన మంత్రి కి చెప్పిన పంజాబ్ రైతు
మన గురువుల యొక్క సలహా కు అనుగుణం గా మనం వ్యవసాయం చేయడంతో పాటు ధరణి మాత ను పరిరక్షించాలి. గురు నానక్ దేవ్ జీ యొక్క ప్రబోధా ల కంటె మిన్న అయినది ఏదీ లేనే లేదు:ప్రధాన మంత్రి
Posted On:
08 JAN 2024 3:21PM by PIB Hyderabad
వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర యొక్క లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ఈ రోజు న భేటీ అయ్యారు. ఈ కార్యక్రమం లో దేశ వ్యాప్తం గా వేల కొద్దీ ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ లబ్ధిదారులు, ఇంకా కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, విధాన సభ ల సభ్యులు మరియు స్థానిక ప్రతినిధులు పాలుపంచుకొన్నారు.
వ్యవసాయ రంగం లో సాధ్యమైనటువంటి అత్యుత్తమమైన లాభాన్ని అందుకోవడం కోసం రైతులు చిన్న చిన్న సమూహాలు గా సంఘటితం కావడం అనేది వికసిత్ భారత్ యొక్క ప్రస్థానం లో చేకూరిన అతిపెద్ద ప్రయోజనం అని పంజాబ్ లోని గురుదాస్‌పుర్ కు చెందిన శ్రీ గురువీందర్ సింహ్ బాజ్‌వా ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు వచ్చారు. తాను సభ్యుడు గా ఉంటున్న రైతుల సమూహం విషతుల్య పదార్థాల కు తావు ఇవ్వనటువంటి వ్యవసాయ పద్ధతుల ఆవిష్కారం కోసం పాటుపడుతున్నట్లు, ఈ క్రమం లో యంత్ర సామగ్రి కై సబ్సిడీ ని తాను అందుకొన్నట్లు ప్రధాన మంత్రి కి ఆయన వివరించారు. ఇది చిన్న రైతుల కు ‘పరాలీ’ (పంట అవశేషం) నిర్వహణ లో సహాయకారి గా నిలచింది అని, అంతేకాకుండా నేల యొక్క స్వస్థత కు కూడాను తోడ్పడింది అని ఆ రైతు అన్నారు. ప్రభుత్వం నుండి అందుతున్న సహాయం కారణం గా గురుదాస్‌పుర్ లో ‘పరాలీ’ ని మండించే ఘటన లు గణనీయం గా తగ్గాయి అని శ్రీ బాజ్‌వా వెల్లడించారు. ఆ ప్రాంతం లో ఎఫ్‌పిఒ సంబంధి కార్యకలాపాలు కూడా పురోగతి లో ఉన్నాయని ఆయన అన్నారు. కస్టమ్ హైరింగ్ స్కీము అనేది చుట్టుప్రక్కల 50 కిలో మీటర్ ల పరిధి లో చిన్న రైతుల కు అండ గా నిలుస్తోంది అని ఆయన చెప్పారు.
‘‘ప్రస్తుతం సరి అయినటువంటి సమర్థన లభిస్తున్నదన్న భావన రైతు కు కలుగుతున్నది’’ అని శ్రీ బాజ్‌వా అన్నారు. ‘‘మోదీ హై తో ముమ్ కిన్ హై’’ (‘‘మోదీ ఉన్నారంటే సాధ్యమే సుమా’’) అనే అభిప్రాయం లో అపేక్ష లు అధికం గా ఉన్నాయి అని ప్రధాన మంత్రి తో ఆ రైతు అన్నారు. దీని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జవాబిస్తూ, రైతులు తన విన్నపాల ను వింటూ ఉన్న కారణం గానే ఇది సాధ్యపడింది అని పేర్కొన్నారు. దీర్ఘకాలం మనుగడ లో ఉండగల వ్యవసాయం గురించి తాను విజ్ఞప్తి చేస్తూనే ఉంటానంటూ ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ‘‘మన గురువులు ఇచ్చిన సలహాల కు అనుగుణం గా మనం సాగు చేయాలి, ధరణి మాత ను కాపాడాలి. వ్యవసాయ రంగం లో గురు నానక్ దేవ్ జీ యొక్క ప్రబోధాల కు మించింది మరేదీ లేదు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర విషయమై ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ‘‘లబ్ధిదారుల లో చివరి వ్యక్తి చెంతకు చేరుకోకుండా ‘మోదీ కీ గ్యారంటీ కీ గాడీ’ (‘మోదీ యొక్క హామీ ని మోసుకువచ్చే బండి’) ఆగబోదు అని ప్రధాన మంత్రి అన్నారు.
***
(Release ID: 1994264)
Visitor Counter : 150
Read this release in:
Bengali
,
Odia
,
Kannada
,
Tamil
,
English
,
Assamese
,
Manipuri
,
Hindi
,
Marathi
,
Urdu
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Malayalam