ప్రధాన మంత్రి కార్యాలయం
ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్-2023లో ఫైనల్స్ చేరిన భారత జట్టుకు ప్రధానమంత్రి అభినందన
Posted On:
15 NOV 2023 10:49PM by PIB Hyderabad
ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్-2023 సెమీఫైనల్స్ పోరులో న్యూజిలాండ్ జట్టుపై అద్భుత విజయంతో ఫైనల్స్ చేరిన భారత క్రికెట్ జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ టోర్నమెంట్ తుది పోటీలోనూ నెగ్గి, విజేతగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
‘‘టీమ్ ఇండియాకు అభినందనలు! భారత ఆటగాళ్లు అత్యుత్తమ ప్రతిభతో సమష్టిగా రాణించి, తిరుగులేని విజయాలతో జట్టును ఫైనల్స్ చేర్చారు. ఆకట్టుకునే బ్యాటింగ్, కట్టుదిట్టమైన బౌలింగ్ ద్వారా మన జట్టు ప్రత్యర్ధి జట్టుపై తన ఆధిపత్యాన్ని స్పష్టంగా చాటుకుంది. ఇప్పటిదాకా ఒటమి ఎరుగని భారత జట్టు తుది పోరులోనూ విజయ పరంపరను కొనసాగించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
అలాగే సెమీఫైనల్స్ లో భారత బౌలర్ మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శనను కూడా ప్రధాని ప్రశంసించారు. ‘‘నేటి సెమీ ఫైనల్ పోరులో మన ఆటగాళ్ల అద్భుత వ్యక్తిగత ప్రదర్శనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ మ్యాచ్ లో మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచ కప్‌లో షమీ @MdShami11 బౌలింగ్ ప్రతిభను రాబోయే తరాల క్రికెట్ ప్రేమికులు కూడా ఆనందిస్తారు. అద్భుతంగా ఆడావు షమీ!’’ అని ప్రధానమంత్రి కొనియాడారు.
***
DS/TS
(Release ID: 1977281)
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada