ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం అత్యుత్తమ ప్రదర్శనను ప్రధాని ప్రశంసించారు

Posted On: 02 NOV 2023 9:29PM by PIB Hyderabad

ఇటీవల జరిగిన అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత జట్టును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. ప్రధాన మంత్రి ఎక్స్ లో పోస్ట్ చేసారు: "ఇటీవల జరిగిన యు-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో భారతదేశపు కుస్తీ పరాక్రమం, మరింత దేదీప్యంగా ప్రకాశిస్తుంది, ఎందుకంటే మనం అత్యుత్తమమైన 9 పతకాలు సాధించాము, వాటిలో 6 మా నారీ శక్తి గెలుచుకుంది. మా ఈ అద్భుతమైన ప్రదర్శన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో రాబోయే రెజ్లర్లు మా రెజ్లర్ల గొప్ప పట్టుదలకు నిదర్శనం. వారికి అభినందనలు, వారి రాబోయే ప్రయత్నాలకు శుభాకాంక్షలు."

*****

DS/SKS


(Release ID: 1974327) Visitor Counter : 149