ప్రధాన మంత్రి కార్యాలయం

గుజరాత్ లోనికేవడియా లో జరిగిన రాష్ట్రీయ ఏకత దివస్ వేడుకల లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి


‘‘అక్టోబరు 31 వ తేదీ దేశం లో మూల మూల న జాతీయ వాదం తాలూకుఉత్సాహాని కి సంబంధించిన ఒక పండుగ రోజు గా మారిపోయింది’’

‘‘ఎర్ర కోట లో ఆగస్టు15 ను, కర్తవ్య పథ్ లో జనవరి 26 న కవాతు ను మరియు స్టేట్యూ ఆఫ్ యూనిటీ లో ఏక్ తాదివస్ ను జరుపుకోవడం.. ఈ మూడూ కూడాను జాతీయ చైతన్య ప్రతీకలు గా మారాయి’’

‘‘స్టేట్యూ ఆఫ్యూనిటీ అనేది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యొక్క ఆదర్శాల కు ప్రతినిధిత్వాన్ని వహిస్తూఉంది’’

‘‘భారతదేశం బానిస మనస్తత్వాన్ని విడచిపెట్టాలి అనే ప్రతిజ్ఞ తో ముందుకు కదులుతున్నది’’

‘‘భారతదేశంచేరుకోలేనటువంటి  ధ్యేయమంటూఏదీ లేదు’’

‘‘ప్రస్తుతం ఏక్ తా నగర్ ను ఒక గ్లోబల్ గ్రీన్ సిటీ గా గుర్తించడం జరిగింది’’

‘‘ఇవాళ యావత్తు ప్రపంచంభారతదేశం యొక్క దృఢ సంకల్పాన్ని, మన దేశ ప్రజల ధైర్య సాహసాల ను మరియు సౌమ్యత ను అంగీకరిస్తున్నాయి’’

‘‘మన దేశ ప్రజల ఏకతమరియు మన అభివృద్ధి యాత్ర ల మార్గం లో సంతృప్తి పరచే తరహా రాజకీయాలే అతి పెద్దఅడ్డంకి’’

‘‘ఒక సమృద్ధమైనభారతదేశం తాలూకు మహత్వాకాంక్ష ను నెరవేర్చుకోవడం కోసం మనం మన దేశ ఏకత నుపరిరక్షించుకొనే దిశ లో నిరంతరం పాటుపడుతూ ఉండాలి’’

Posted On: 31 OCT 2023 11:09AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న రాష్ట్రీయ ఏకత దివస్ కు సంబంధించిన కార్యక్రమాల లో పాలుపంచుకొన్నారు. సర్ దార్ పటేల్ గారి జయంతి సందర్భం లో స్టేట్యూ ఆఫ్ యూనిటీవద్ద ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ని సమర్పించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్రీయ ఏకత దివస్ కవాతు ను వీక్షించారు; ఈ కవాతు లో బిఎస్ఎఫ్, ఇంకా రాష్ట్ర పోలీసు విభాగాని కి చెందిన వేరు వేరు దళాలు పాల్గొన్నాయి. అంతేకాకుండా, సిఆర్ పిఎఫ్ కు చెందిన మహిళలు మోటారు సైకిళ్ళ పై ఆవిష్కరించిన ఒక సాహస ప్రధానమైన విన్యాసాలు, బిఎస్ఎఫ్ కు చెందిన మహిళల పైప్ బ్యాండ్ కార్యక్రమం, గుజరాత్ మహిళా పోలీసు విభాగం సమర్పించినటువంటి ఒక కార్యక్రమం, ఎన్ సిసి యొక్క ప్రత్యేక ప్రదర్శన, పాఠశాల విద్యార్థులు పాల్గొన్న బ్యాండ్ కార్యక్రమం, భారతీయ వాయు సేన సమర్పించిన ఫ్లయ్ పాస్ట్ లతో పాటు, వైబ్రంట్ విలేజెస్ లో ఆర్థిక చైతన్యాన్ని చాటే ఒక కార్యక్రమం తదితరాల ను కూడా ప్రధాన మంత్రి తిలకించారు.

జన సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, భారతదేశం లో యువతీ యువకులు మరియు యోధుల యొక్క ఏకత శక్తి ని రాష్ట్రీయ ఏకత దివస్ అనేది చాటిచెబుతోంది అని అభివర్ణించారు. ‘‘ఒక విధం గా ఇక్కడ బుల్లి భారతదేశాన్ని నేను చూస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి అన్నారు. భాషలు, రాష్ట్రాలు మరియు సంప్రదాయాలు వేరైనప్పటికీ దేశం లో ప్రతి ఒక్క వ్యక్తి ఏకత తాలూకు బలమైన పాశం తో ముడిపడ్డారు అని ఆయన నొక్కి చెప్పారు. ‘‘పూస లు అనేకం ఉన్నా గానీ దండ మాత్రం ఒక్కటే, మనం భిన్నం గా ఉన్నప్పటికీ ఒక్కటి గా ఉంటున్నాం’’ అని ఆయన అన్నారు. ఆగస్టు లో 15 వ తేదీ ని స్వాతంత్య్ర దినం గా మరియు జనవరి లో 26 వ తేదీ ని గణతంత్ర దినం గా జరుపుకొన్నట్లే అక్టోబరు 31 వ తేదీ ని దేశవ్యాప్తం గా ఏకతతాలూకు పండుగ రోజు గా పాటిస్తున్నట్లు ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఎర్రకోట లో జరిగే స్వాతంత్య్ర దిన ఉత్సవాలు, కర్తవ్య పథ్ లో జరిగే గణతంత్ర దిన కవాతు, మరి నర్మద మాత తీర ప్రాంతం లో గల స్టేట్యూ ఆఫ్ యూనిటీ వద్ద జరిగే రాష్ట్రీయ ఏకత దివస్ వేడుక లు.. ఈ మూడూ జాతీయ చైతన్యాని కి ప్రతీక లు అని ఆయన ప్రముఖం గా పేర్కొన్నారు. ఈ రోజు న నిర్వహించుకొంటున్న కార్యక్రమాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఎవరైతే ఏకత నగర్ ను సందర్శిస్తారో వారు స్టేట్యూ ఆఫ్ యూనిటీ ని వీక్షించడం ఒక్కటే కాకుండా, సర్ దార్ సాహబ్ యొక్క జీవనం మరియు భారతదేశ జాతీయ అఖండత కు ఆయన అందించిన సేవల ను సైతం దర్శిస్తారు అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘స్టేట్యూ ఆఫ్ యూనిటీ అనేది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆదర్శాల కు ప్రతినిధిత్వాన్ని వహిస్తున్నది’’ అని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆ విగ్రహ నిర్మాణం లో పౌరులు అందించిన తోడ్పాటుల ను గురించి ఆయన చెప్తూ, రైతులు ఈ కార్యం కోసం వారి ఉపకరణాల ను విరాళం గా ఇచ్చిన ఉదాహరణ ను ప్రస్తావించారు. వాల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం కోసం భారతదేశం లో వివిధ ప్రాంతాల నుండి మట్టి ని తీసుకు వచ్చి, ఆ మట్టి భాగాల ను ఒక చోట కలపడం జరిగింది అని కూడా ఆయన అన్నారు. దేశవ్యాప్తం గా రన్ ఫర్ యూనిటీమరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల లో పాలుపంచుకోవడం ద్వారా రాష్ట్రీయ ఏకత దివస్ వేడుకల లో కోట్ల కొద్దీ పౌరులు జతపడ్డారు అని ప్రధాన మంత్రి తెలియ జేశారు. ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావన ను ఒక పండుగ లాగా జరుపుకోవడం కోసం ముందుకు వచ్చిన 140 కోట్ల మంది పౌరుల లో సర్ దార్ సాహబ్ యొక్క ఆదర్శాలు మూర్తీభవించాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. సర్ దార్ పటేల్ గారి కి ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ని సమర్పించి, పౌరుల కు రాష్ట్రీయ ఏకత దివస్ సందర్భం లో అభినందనల ను తెలియ జేశారు.

రాబోయే 25 సంవత్సరాల కాలం లో భారతదేశం సమృద్ధమైనటువంటి మరియు అభివృద్ధి చెందినటువంటి దేశం గా మారనున్న తరుణం లో ఈ కాలం అత్యంత ముఖ్యమైంది అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. స్వాతంత్య్రం సాధన కు పూర్వం 25 సంవత్సరాలు ఏ విధం గా గడిచాయో, అదే విధమైనటువంటి సమర్పణ భావం ప్రస్తుతం అవసరం అని ఆయన పిలుపు ను ఇచ్చారు. ప్రపంచం దృష్టి లో భారతదేశం యొక్క ప్రతిష్ఠ పెరుగుతోందని ఆయన అన్నారు. ‘‘మనం అతి పెద్దదైన ప్రజాస్వామ్య ప్రతిష్ఠ ను ఒక సరిక్రొత్త శిఖర స్థాయి కి తీసుకుపోతున్నామన్న సంగతి గర్వపడేటటువంటి అంశం’’ అని ఆయన అన్నారు. భద్రత లో, ఆర్థిక వ్యవస్థ లో, విజ్ఞాన శాస్త్రం లో, దేశీయ రక్షణ రంగ సంబంధి ఉత్పత్తి లో, భారతదేశం ఒక పటిష్టమైన స్థితి లో ఉంది’’ అని ఆయన ప్రస్తావిస్తూ, ప్రపంచం లోని కీలక కంపెనీల లో నాయకత్వ స్థానం లో, క్రీడా రంగం లో అగ్ర స్థానాల లో భారతీయులు నిలబడుతున్న సంగతి ని ఆయన ప్రస్తావించారు.

అదే పని గా ముందు కు అడుగుల ను వేస్తూ, బానిస మనస్తత్వాన్ని వదలి వేయాలి అనే ప్రతిజ్ఞ ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ, ‘‘భారతదేశం అభివృద్ధి పయనం లో పయనిస్తూనే భారతదేశం యొక్క వారసత్వాన్ని కాపాడుకొంటోంది’’ అన్నారు. నౌకాదళాని కి చెందిన ధ్వజం లో వలసవాద కాలానికి చెందిన చిహ్నాన్ని తొలగించడం, వలస హయాం కు చెందిన అనవసరమైన చట్టాల కు స్వస్తి పలకడం, ఐపిసి స్థానం లో క్రొత్త మార్పు ను ప్రవేశ పెట్టడం, మరి అలాగే ఇండియా గేట్ వద్ద వలసవాద ప్రతినిధుల స్థానం లో నేతాజీ ప్రతిమ ను ఏర్పాటు చేయడం వంటి విషయాల ను ప్రధాన మంత్రి వివరించారు.

‘‘ఇవాళ, భారతదేశం చేరుకోలేని అటువంటి లక్ష్యమంటూ ఏదీ లేదు’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. సబ్ కా ప్రయాస్ శక్తి ని గురించి ఆయన ప్రముఖం గా ప్రకటిస్తూ, 370 వ అధికరణం రద్దు ప్రసక్తి ని తీసుకువచ్చారు. ప్రస్తుతం కశ్మీర్ కు మరియు దేశం లోని మిగతా ప్రాంతాల కు మధ్య నిలచిన 370 వ అధికరణం అనే ఒక గోడ కూలిపోయింది, మరి ఇది సర్ దార్ సాహబ్ ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన కు సంతోషాన్ని ఇచ్చి ఉంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

దీర్ఘకాలం గా పరిష్కారం కాకుండా ఉన్నటువంటి అంశాల ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, సర్ దార్ సరోవర్ ఆనకట్ట పనులు 5-6 దశాబ్దాలు గా స్తంభించిపోగా, వాటిని గత కొన్నేళ్ళ లో పూర్తి చేయడమైందన్నారు. కేవడియా-ఏక్ తా నగర్ యొక్క పరివర్తన అనేది సంకల్ప్ సే సిద్ధి తాలూకు ఒక ఉదాహరణ గా ఉంది అని ఆయన ప్రస్తావించారు. ఇవాళ ఏకత నగర్ ను ఒక గ్లోబల్ గ్రీన్ సిటీ గా గుర్తిస్తున్నారు అని ఆయన అన్నారు. అనేక పర్యటన ప్రధానమైన ఆకర్షణ కేంద్రాల కు తోడు గత 6 నెలల లో ఏకత నగర్ లో ఒక లక్ష ఏభై వేల మొక్కల ను నాటడం జరిగింది అని ప్రధాన మంత్రి తెలిపారు. ఆ ప్రాంతం లో ఇప్పటికే సౌర విద్యుత్తు ఉత్పాదన మరియు సిటీ గ్యాస్ వితరణ వేళ్ళూనుకొన్నాయని, మరి ప్రస్తుతం హెరిటేజ్ ట్రేన్ ను కూడా ఏకత నగర్ కు జోడించడం జరుగుతుంది అని వివరించారు. గడచిన 5 సంవత్సరాల లో ఒక కోటి ఏభై లక్షల మంది కి పైగా పర్యటకులు వచ్చారని, తద్వారా స్థానిక ఆదివాసి సముదాయాల కు ఉపాధి అవకాశాలు అందివచ్చాయి అని ఆయన అన్నారు.

‘‘ప్రస్తుతం యావత్తు ప్రపంచం భారతదేశం యొక్క మొక్కవోని సంకల్పం మరియు ఇక్కడి ప్రజల సాహసాన్ని, సౌమ్యత ను అంగీకరిస్తోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం ప్రపంచం భారతదతేశం యొక్క ఈ సంకల్పాన్నుండి ప్రేరణ ను పొందుతోంది అని ఆయన అన్నారు. కొన్ని ధోరణుల కు వ్యతిరేకం గా సైతం నడచుకోవలసి ఉంది అంటూ ఆయన హెచ్చరిక ను చేశారు. ప్రస్తుతం ప్రపంచం లో భౌగోళికపరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి అస్థిరత్వం తలెత్తడాన్ని గురించి ప్రధాన మంత్రి చెప్తూ, కోవిడ్ మహమ్మారి అనంతరం అనేక దేశాల ఆర్థిక వ్యవస్థ లు అతలాకుతలం అయ్యాయి, ఆయా దేశాల లో ధరల పెరుగుదల మరియు నిరుద్యోగం గత 30-40 సంవత్సరాల కాలం లో శిఖర స్థాయిల కు చేరాయి అని తెలిపారు. ఈ స్థితి లో భారతదేశం సరిక్రొత్త రికార్డుల ను నెలకొల్పడంతో పాటు సంకల్పాల ను నెరవేర్చుకొంటూ నిరంతరం గా ముందుకు సాగుతోంది అని స్పష్టం చేశారు. గడచిన తొమ్మిది సంవత్సరాల లో ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలు మరియు అమలు చేసిన విధానాల సకారాకత్మక ప్రభావాన్ని ప్రస్తుతం గమనించవచ్చును అని ప్రధాన మంత్రి అన్నారు. గత 5 సంవత్సరాల లో 13.5 కోట్ల మంది కి పైగా భారతీయులు పేదరికం నుండి బయటకు వచ్చారు అని ఆయన తెలిపారు. దేశం లో స్థిరత్వాన్ని నిలబెట్టాలి అంటూ పౌరుల కు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. భారతదేశాన్ని అభివృద్ధి మార్గం లోకి ప్రవేశపెట్టిన 140 కోట్ల మంది పౌరుల కృషి వృథా పోకూడదు అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘మనం భవిష్యత్తు పై దృష్టి పెడుతూనే, జాతీయ లక్ష్యాల ను పూర్తి చేయాలన్న మన సంకల్పాన్ని నెరవేర్చుకొంటూ ఉండాలి’’ అని ఆయన చెప్పారు.

దేశం లో భద్రత కై ఉక్కు మనిషి సర్ దార్ సాహబ్ గంభీరమైన ఆలోచనలను చేసే వారు అని ప్రధాన మంత్రి చెప్తూ, ఈ విషయం లో గడచిన 9 ఏళ్ళ లో తీసుకొన్న చర్యల ను గురించి, మరి అలాగే వినాశకర శక్తులు ఇదివరకు సాధించినటువంటి సఫలతల ను వారికి దూరం చేస్తూ రా సవాళ్ళ ను ఏ విధం గా బలంగా తిప్పి కొడుతోందీ ఆయన తెలియజేశారు. దేశ ప్రజల ఏకత్వం పై జరుగుతున్న దాడుల పట్ల జాగరూకులై ఉండవలసిన అవసరం ఉందని కూడా ఆయన స్పష్టంచేశారు.

భారతదేశం యొక్క అభివృద్ధి యాత్ర లో అతి ముఖ్య అవరోధం తృప్తి పరచేటటువంటి రాజకీయాలే అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. గడచిన అనేక దశాబ్దాల లో ఇది స్పష్టం అయింది. తుష్టి ప్రధానమైన రాజకీయాల లో మునిగి తేలే వారు ఉగ్రవాదం పట్ల మరియు మానవీయత కు శత్రువు గా నిలచే వారి పట్ల శీతకన్ను వేస్తున్నారు అని ఆయన అన్నారు. ఆ తరహా ఆలోచన విధానం దేశ ఏకత్వాన్ని అపాయం లో పడవేస్తుంది అంటూ ఆయన హెచ్చరించారు.

త్వరలో జరుగనున్న మరియు రాబోయే కాలం లో జరుగనున్న ఎన్నికల ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ సకారాత్మకమైన రాజకీయాల ను గురించి ఎంత మాత్రం పట్టించుకోనటువంటి మరియు జాతి వ్యతిరేక కార్యకలాపాల లోను, సంఘ వ్యతిరేక కార్యకలాపాల లోను ప్రమేయం పెట్టుకొంటున్న వర్గం తో అప్రమత్తం గా మెలగాలని జాగ్రత చెప్పారు. ‘‘అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించాలి అనే లక్ష్యాన్ని సాధించడం కోసం దేశ ఏకత ను కాపాడేందుకు మనం మన కృషి ని నిరంతరం గా కొనసాగించవలసి ఉంది. మనం ఏ రంగం లో ఉన్నప్పటికీ, ఆ రంగం లో వంద శాతం తోడ్పాటు ను ఇచ్చి తీరాలి. రాబోయే తరాల కు మెరుగైన భవిష్యత్తు ను ప్రసాదించాలి అంటే ఇది ఒక్కటే ఉపాయం’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సర్ దార్ పటేల్ గారి ని గురించి మైగవ్ లో ఒక జాతీయ పోటీ ని నిర్వహిస్తున్న విషయాన్ని గురించి కూడా శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు.

ప్రస్తుత భారతదేశం విశ్వాసం ఉట్టిపడుతున్నటువంటి ప్రతి ఒక్క పౌరుడి తో కూడిన న్యూ ఇండియాగా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ విశ్వాసం ఇదే విధం గా కొనసాగే, మరి ఏకత్వ భావన ను కూడా ఇదే మాదిరి గా ఉండేటట్లు చూడాలి అని ఆయన నొక్కి పలికారు. సర్ దార్ పటేల్ గారి కి పౌరుల పక్షాన ప్రధాన మంత్రి వినమ్రత శ్రద్ధాంజలి ని సమర్పిస్తూ, తన ప్రసంగాన్ని ముగించారు. రాష్ట్రీయ ఏకత దివస్ సందర్భం లో తన శుభాకాంక్షల ను కూడా ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

పూర్వరంగం

దేశ ఏకత, అఖండత మరియు భద్రత లను పరిరక్షిస్తూ మరి దృఢ భావన ను పెంచాలనే ఉద్దేశ్యం తో ప్రధాన మంత్రి తన దూరదర్శి నాయకత్వం లో సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ గారి జయంతి ని రాష్ట్రీయ ఏకత దివస్ గా పాటించాలన్న నిర్ణయాన్ని తీసుకోవడమైంది.

 

***

DS/TS



(Release ID: 1973388) Visitor Counter : 131