ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారాగేమ్స్‌ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్లో స్వర్ణ విజేత సుహాస్‌ ఎల్‌.యతిరాజ్‌కు ప్రధాని అభినందన

प्रविष्टि तिथि: 27 OCT 2023 7:41PM by PIB Hyderabad

   చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్‌ పురుషుల ‘బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్‌ఎల్‌-4’లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సుహాస్‌ ఎల్‌.యతిరాజ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారా గేమ్స్‌ ‘బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్‌-4లో స్వర్ణం సాధించిన సుహాస్ ఎల్.యతిరాజ్‌కు నా అభినందనలు! ఈ పోటీలో అతడి ప్రతిభ, అంకిత భావం అద్వితీయం. అతని దృఢ సంకల్పం, దీక్షకు ఈ విజయం అద్దం పట్టింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1972418) आगंतुक पटल : 215
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , English , Urdu , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam