నాడు పోస్టు చేయడమైనది:
25 OCT 2023 4:46PM by PIB Hyderabad
చైనాలోని హాంగ్జౌలో జరిగిన పారా ఆసియా క్రీడలు 2022లో బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్ ఎస్ఎల్3-ఎస్‌యూ5 ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నందుకు ప్రమోద్ భగత్, మనీషా రామదాస్‌లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యమంగా పోస్ట్ చేసారు:
“ఆసియన్ పారా గేమ్స్‌లో బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్ ఎస్ఎల్3-ఎస్యు5 ఈవెంట్లో కాంస్య పతకాన్ని సాధించినందుకు ప్రమోద్ భగత్, మనీషా రామదాస్ల చురుకైన ద్వయానికి అభినందనలు. భారతదేశం ఈ అద్భుతమైన విజయాన్ని గణించలేని గర్వంతో జరుపుకుంటుంది! అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.