ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారాగేమ్స్‌ ‘క్లబ్‌ త్రో-ఎఫ్‌51’లో రజత పతక విజేత ధరంవీర్‌ను అభినందించిన ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 23 OCT 2023 5:24PM by PIB Hyderabad

   చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్-2022లో భాగంగా ‘క్లబ్ త్రో- ఎఫ్51’లో రజత పతకం గెలుచుకున్న భారత క్రీడాకారుడు ధరంవీర్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారా గేమ్స్‌ ‘క్లబ్ త్రో’ (ఎఫ్‌51)లో రజత పతకం కైవసం చేసుకున్న ధరంవీర్‌ను చూసి నేనెంతో గర్విస్తున్నాను. ఇది నిజంగా స్ఫూర్తిదాయక ప్రతిభా ప్రదర్శన. అతడు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 1970868) సందర్శకుల సూచీ సంఖ్య : : 103