ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్-2028లో క్రికెట్కు చోటుపై ప్రధాని హర్షం

Posted On: 16 OCT 2023 8:03PM by PIB Hyderabad

   లాస్ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌-2028లో బేస్ బాల్/సాఫ్ట్ బాల్, క్రికెట్, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్, లాక్రోస్, స్క్వాష్‌ క్రీడలకు స్థానం కల్పించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చడం ద్వారా ఈ అద్భుత క్రీడకు ప్రపంచవ్యాప్త ప్రజాదరణ పెరుగుతుందని ఆయన అన్నారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్-2028 @LA28లో బేస్ బాల్/సాఫ్ట్ బాల్, క్రికెట్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రోస్, స్క్వాష్ క్రీడలకు స్థానం కల్పించడం అత్యంత ముదావహం. ఆయా క్రీడాకారులకే కాకుండా అభిమానులకూ ఇదొక శుభవార్త. ఇక క్రికెట్‌ను ప్రేమించే దేశంగా, ఈ అద్భుత క్రీడకు పెరుగుతున్న ప్రపంచ ప్రజాదరణను ప్రతిబింబిస్తూ క్రికెట్‌ను చేర్చడాన్ని భారత్‌ ప్రత్యేకంగా స్వాగతిస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(Release ID: 1968291) Visitor Counter : 92