ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రిస్వాతంత్య్ర దినం నాడు తాను చేసిన ప్రసంగం లోని ప్రకటనల ఆధారం గా రూపుదిద్దుకొన్నవివిధ పథకాల లో పురోగతి ని తాజా గా సమీక్షించారు


మహిళల పై ప్రత్యేక శ్రద్ధ: రెండు కోట్ల మందిసోదరీమణుల ను లక్షాధికారులు గా తీర్చిదిద్దడం మొదలుకొని15,000 మహిళా ఎస్ హెచ్ జి లకు సాధికారిత కల్పన కై డ్రోన్ లనుమంజూరు చేయడం వరకు వివిధ పథకాలు చర్చ కు వచ్చాయి

జన్ ఔషధి విక్రయ స్టోర్స్ యొక్క పరిధి ని త్వరిత గతి న 10,000నుండి 25,000 కు విస్తరించడాని కి సంబంధించిన పథకం పై సైతంకసరత్తు జరుగుతున్నది

Posted On: 10 OCT 2023 7:50PM by PIB Hyderabad

స్వాతంత్య్ర దినం నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను ఇచ్చిన ఉపన్యాసం ఆధారం గా రూపొందిన వివిధ పథకాల లో చోటు చేసుకొన్న పురోగతి పై చర్చించడం కోసం ఏర్పాటైన ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాని కి అధ్యక్షత వహించారు.

రెండు కోట్ల మంది సోదరీమణుల ను లక్షాధికారులు గా తయారు చేయడం గురించి అంటే స్వయం సేవ సమూహాలు (ఎస్ హెచ్ జి స్) లేదా ఆంగన్ బాడీ లతో అనుబంధం కలిగిన మహిళల ను లక్షాధికారులు గా తీర్చిదిద్దడాని కి సంబంధించి ప్రధాన మంత్రి మాట్లాడారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించినటువంటి వివిధ జీవనోపాధి సంబంధి ఉపాయాల ను గురించి ఆయన అధికారుల ను అడిగి తెలుసుకొన్నారు.

ప్రధాన మంత్రి స్వాతంత్య్ర దినం సందర్భం లో తాను ఇచ్చిన ఉపన్యాసం లో, 15,000 స్వయం సహాయ సమూహాల సభ్యురాళ్ళ కు వ్యవసాయం మరియు తదితర ప్రయోజనాల కు గాను డ్రోన్ లను ఇచ్చే అంశాన్ని గురించి మాట్లాడారు. ఈ అంశాన్ని అమలు చేసేందుకు రూపొందిస్తున్న వివిధ పథకాల ను గురించి ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు రావడమైంది; ఆ పథకాల లో మహిళా ఎస్ హెచ్ జి స్ కు శిక్షణ ఇవ్వడం మొదలుకొని కార్యక్రమాల పర్యవేక్షణ వరకు భాగం గా ఉన్నాయి.

మందుల ను తక్కువ ధరల కు ప్రజల కు అందజేయడానికి ఉద్దేశించిన జన్ ఔషధి స్టోర్స్ సంఖ్య ప్రస్తుతం భారతదేశం లో 10,000 గా ఉండగా వాటిని పెంచి 25,000 కు చేర్చే అంశం గురించి కూడా ప్రధాన మంత్రి ఈ సమావేశం లో మాట్లాడారు. ఈ యొక్క విస్తరణ కు సంబంధించి ఆచరించవలసిన వ్యూహాన్ని ప్రధాన మంత్రి సమీక్షించారు.

***


(Release ID: 1966642) Visitor Counter : 118