ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గత 60 ఏళ్లలో ఆసియా క్రీడల భారతదేశ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని ప్రధాన మంత్రి ప్రశంసించారు

Posted On: 08 OCT 2023 11:03AM by PIB Hyderabad

 గత 60 ఏళ్లలో ఆసియా క్రీడ‌లలో భారతదేశం అత్యధికంగా 107 పతకాలు సాధించి అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కొనియాడారు. క్రీడాకారుల అచంచలమైన సంకల్పం, గొప్ప స్ఫూర్తి, కృషిని శ్రీ మోదీ కొనియాడారు.

 

"భారత్ ఆసియా క్రీడల్లో ఎంత గొప్ప చారిత్రక విజయం సాధించింది!

మన అపురూపమైన అథ్లెట్లు గత 60 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 107 పతకాలు సాధించడం పట్ల యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది.

మన క్రీడాకారుల అచంచలమైన సంకల్పం, గొప్ప స్ఫూర్తి, కృషి దేశం గర్వించేలా చేసింది. వారి విజయాలు  మనందరికీ స్ఫూర్తినిచ్చాయి, మన శ్రేష్ఠతకు మన నిబద్ధతను పునరుద్ఘాటించాయి.

 

***

DS/TS


(Release ID: 1965784) Visitor Counter : 138