ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడల సెపక్ తక్రా మహిళల రెగు విభాగంలో కాంస్యం సాధించిన భారత జట్టుకు ప్రధాని అభినందనలు
Posted On:
06 OCT 2023 6:15PM by PIB Hyderabad
ఆసియా క్రీడలలో సెపక్ తక్రా మహిళల రెగు విభాగంలో కాంస్య పతకం కైవసం చేసుకున్న భారత జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“ఆసియా క్రీడల్లో మహిళల రెగు ఈవెంట్లో కాంస్యం సాధించిన మన సెపక్ తక్రా జట్టుకు అభినందనలు! వారి అసాధారణ నైపుణ్యం, అచంచల అంకిత భావం, దృఢ సంకల్పం ఈ పతకం రూపంలో అంతర్జాతీయ వేదికపై ప్రకాశించాయి. వారు సాధించిన ఈ అద్భుత విజయాన్ని యావద్దేశం వేడుక చేసుకుంటుంది!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/ST
(Release ID: 1965267)
Visitor Counter : 85
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam