నాడు పోస్టు చేయడమైనది:
05 OCT 2023 9:00PM by PIB Hyderabad
ఆసియా క్రీడల స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత క్రీడాకారులు దీపిక పళ్లికల్-హరీందర్ పాల్ సంధు జంటను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“ఆసియా క్రీడల స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకం తెచ్చిన మన జట్టుకు నా అభినందనలు! ఈ అద్భుత విజయం సాధించడంలో దీపిక పళ్లికల, హరీందర్ పాల్ సంధు @DipikaPallikal and @sandu_harinder ఎనలేని ప్రతిభా ప్రదర్శన చేశారు. భవిష్యత్తులోనూ మీరు మరిన్ని విలువైన విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.