ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల మహిళల బాక్సింగ్ 75 కిలోల విభాగంలో రజతం సాధించిన లవ్లీన్ బొర్గొహెయిన్కు ప్రధాని అభినందన

Posted On: 04 OCT 2023 7:18PM by PIB Hyderabad

   సియా క్రీడల మహిళల బాక్సింగ్‌ 75 కిలోల విభాగంలో రజత పతకం కైవసం చేసుకున్న లవ్లీన్‌ బొర్గొహెయిన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“మహిళల బాక్సింగ్‌ 75 కిలోల విభాగంలో దేశానికి రజత పతకం సాధించిపెట్టిన లవ్లీన్‌ బొర్గొహెయిన్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ఆమె ప్రదర్శించిన ప్రతిభ, నైపుణ్యం అనుపమానం. ఆమె సాధించిన ఈ విజయం మనమంతా వేడుక చేసుకునేందుకు తగిన సందర్భాన్నిచ్చింది. ఆమె మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతూ భవిష్యత్తులోనూ విజయపథంలో దూసుకుపోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1964507) Visitor Counter : 89