మంత్రిమండలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడి) చట్టం, 1956 కింద కృష్ణా జల వివాద ట్రిబ్యునల్-IIకి సంబంధించిన నిబంధనలను ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం
Posted On:
04 OCT 2023 4:08PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడి యాక్ట్‌లోని సెక్షన్ 5(1) కింద తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్(ఏపీ) రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్-II (కెడబ్ల్యూడిటి-II)కి మరింత రిఫరెన్స్ (టిఒఆర్) జారీకి ఆమోదం తెలిపింది. ఇది చట్టపరమైన అభిప్రాయాన్ని స్వీకరించడం మరియు దాని ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం (జీఒటి) ఫిర్యాదులో అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడి) చట్టం, 1956 సెక్షన్ (3) కింద లేవనెత్తిన సమస్యలపై ఆధారపడి ఉంటుంది.
కృష్ణా నదీ జలాల వినియోగం, పంపిణీ లేదా నియంత్రణపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం తెలంగాణ మరియు ఏపీ రెండు రాష్ట్రాలలో వృద్ధికి కొత్త మార్గాలను తెరుస్తుంది మరియు ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. తద్వారా మన దేశ నిర్మాణంలో సహాయపడుతుంది.
ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడి చట్టం, 1956 సెక్షన్ 3 ప్రకారం పార్టీ రాష్ట్రాలు చేసిన అభ్యర్థనలపై కేంద్ర ప్రభుత్వం 02.04.2004న కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-IIని ఏర్పాటు చేసింది. తదనంతరం 02.06.2014న భారత యూనియన్‌లో తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి ఉనికిలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (ఏపిఆర్‌ఏ), 2014లోని సెక్షన్ 89 ప్రకారం, ఏపిఆర్‌ఏ, 2014లోని పేర్కొన్న సెక్షన్‌లోని క్లాజులు (ఎ) మరియు (బి)లను పరిష్కరించడానికి కెడబ్ల్యూడిటి-II పదవీకాలం పొడిగించబడింది.
తదనంతరం, తెలంగాణ ప్రభుత్వం (జీఒటి) 14.07.2014న భారతప్రభుత్వ జలవనరులు, నది అభివృద్ధి & గంగా పునరుజ్జీవన శాఖ (డిఒడబ్ల్యూఆర్,ఆర్‌డి&జీఆర్), జలశక్తి మంత్రిత్వ శాఖ (ఎంఒజెఎస్) ఫిర్యాదును ఫార్వార్డ్ చేసింది. కృష్ణా నదీ జలాల వినియోగం, పంపిణీ లేదా నియంత్రణపై వివాదాన్ని ఇది సూచిస్తోంది. 2015లో గౌరవనీయ సుప్రీం కోర్ట్ (ఎస్‌సి)లో జీఒటి ద్వారా రిట్ పిటీషన్ కూడా దాఖలు చేయబడింది. 2018లో జీఒటి డిఒడబ్ల్యూఆర్,ఆర్‌డి&జీఆర్,ఎంఒజేఎస్‌ని కంప్లైంట్ చేయడం ద్వారా ప్రస్తుత కెడబ్ల్యూడిటి-IIకి ఫిర్యాదు చేయాలని అభ్యర్థించింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సూచన పరిధి మాత్రమే. ఈ విషయం తరువాత 2020లో గౌరవనీయ మంత్రి (జల శక్తి) ఆధ్వర్యంలో జరిగిన 2వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించబడింది. 2వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించినట్లుగా జీఒటి 2021లో పేర్కొన్న రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది మరియు తదనంతరం ఈ విషయంలో డిఒడబ్ల్యూఆర్,ఆర్‌డి&జీఆర్ ద్వారా చట్ట & న్యాయ మంత్రిత్వ శాఖ (ఎంఒఎల్&జే) యొక్క చట్టపరమైన అభిప్రాయాన్ని కోరింది.
***
(Release ID: 1964208)
Visitor Counter : 201
Read this release in:
Assamese
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada