ప్రధాన మంత్రి కార్యాలయం
10వేల మీటర్ల పరుగులో రజతం సాధించిన కార్తీక్ కుమార్కు ప్రధాని అభినందన
प्रविष्टि तिथि:
30 SEP 2023 8:15PM by PIB Hyderabad
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా క్రీడల 10వేల మీటర్ల పరుగులో రజత పతకం సాధించిన కార్తీక్ కుమార్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“ఆసియా క్రీడల 10వేల మీటర్ల పరుగులో కార్తీక్ కుమార్ రజత పతకం సాధించి భారత కీర్తి కిరీటంలో మరో కలికితురాయిని చేర్చాడు. అతని అసాధారణ అంకితభావం, దీక్ష, అద్భుత ప్రతిభా ప్రదర్శన మనకీ ఘనతను సాధించిపెట్టాయి. దేశం గర్వంతో ఉప్పొంగేలా చేసిన అతనికి అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1962616)
आगंतुक पटल : 155
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
Tamil
,
Kannada
,
Bengali
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Malayalam