ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల్లో మహిళల ‘50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌’లో కాంస్యం సాధించిన ఆషీ చౌక్సీని అభినందించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 27 SEP 2023 8:48PM by PIB Hyderabad

   ఆసియా క్రీడల మహిళా ‘50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్’ పోటీలో కాంస్య పతకం సాధించిన ఆషీ చౌక్సీని ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ పోస్టు ద్వారా పంపిన సందేశంలో:  న్న

“ఆసియా క్రీడల్లో మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ పోటీలో కాంస్య పతకం గెలుచుకున్న అద్భుత షూటర్‌ చౌక్సీకి అభినందనలు. ఈ పోటీలో ఆమె ప్రదర్శించిన అంకితభావం, సంయమనం అబ్బురపరిచాయి. భవిష్యత్తులోనూ ఆమె మరింత రాణించి, రాబోయే తరం క్రీడాకారులకు స్ఫూర్తినివ్వాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1961693) आगंतुक पटल : 147
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Gujarati , Tamil , Kannada , Assamese , Odia , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Punjabi