గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
‘ఏక్ తారీఖ్,, ఏక్ ఘంటా.. ఏక్ సాథ్..’
- 1 అక్టోబర్, 2023 ఉదయం 10 గంటలకు స్వచ్ఛత కోసం పౌరుల నేతృత్వంలోని ఒక గంట శ్రమదాన్ కార్యక్రమపు జాతీయ కార్యాచరణకు పిలుపు
प्रविष्टि तिथि:
24 SEP 2023 1:30PM by PIB Hyderabad
నాడు పోస్ట్ చేయడమైనది: 24 SEP 2023 1:30PM by PIB Hyderabad
తొమ్మిదేళ్ల క్రితం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2014లో స్వచ్ఛత కోసం ఒక స్పష్టమైన పిలుపు ఇచ్చారు. అన్ని వర్గాల పౌరులు స్వచ్ఛ భారత్కు యాజమాన్యాన్ని తీసుకోవడంలో అపారమైన ఉత్సాహంతో పరస్పరం స్పందించారు. ఫలితంగా, స్వచ్ఛత జాతీయ ప్రవర్తనగా మారింది మరియు స్వచ్ఛ భారత్ మిషన్ ఇంటి పేరుగా మారింది. గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి తోటి పౌరులకు ప్రత్యేకమైన కార్యాచరణకు పిలుపునిచ్చాడు. మన్ కీ బాత్ 105వ ఎపిసోడ్లో అక్టోబర్ 1వ తేదీ ఉదయం 10 గంటలకు స్వచ్ఛత కోసం ఒక గంట శ్రమదాన్ కార్యక్రమం చేపట్టాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. బాపు జయంతి సందర్భంగా పౌరులందరూ సమిష్టిగా 'స్వచ్ఛాంజలి' ఘటించాలని కోరారు. ‘స్వచ్ఛతా హి సేవాభియాన్’పై ఆయన మాట్లాడుతూ.. “అక్టోబర్ 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు పరిశుభ్రతపై పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. మీరు కూడా సమయాన్ని వెచ్చించి పరిశుభ్రతకు సంబంధించిన ఈ కార్యక్రమంలో సహకరించాలని కోరారు. మీరు మీ వీధిలో లేదా పరిసరాల్లో లేదా పార్క్, నది, సరస్సు లేదా మరేదైనా బహిరంగ ప్రదేశంలో కూడా ఈ పరిశుభ్రత కార్యక్రమం చేపట్టి పాలుపంచుకోవచ్చు అని అన్నారు. ఈ మెగా క్లీన్‌నెస్ డ్రైవ్ అన్ని వర్గాల పౌరులను మార్కెట్ స్థలాలు, రైల్వే ట్రాక్‌లు వాటర్ బాడీలు పర్యాటక ప్రదేశాలు, మతపరమైన ప్రదేశాలు మొదలైన బహిరంగ ప్రదేశాల క్లీనింగ్ కార్యకలాపాలలో చేరాలని పిలుపునిచ్చారు. ప్రతి పట్టణం, గ్రామ పంచాయతీ, పౌర విమానయానం, రైల్వేలు, ఇన్ఫర్మేషన్ & టెక్నాలజీ మొదలైన ప్రభుత్వంలోని అన్ని రంగాలు, ప్రభుత్వ సంస్థలు ఎన్.జి.ఓ/ ఆర్.డబ్ల్యు.ఏ/ ప్రయివేటు సంస్థలు పౌరుల నేతృత్వంలో పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టేలా వ్యవస్థను సులభతరం చేస్తాయి. క్లీనింగ్ ఈవెంట్‌లను నిర్వహించడానికి ఆసక్తి ఉన్న సంస్థ యుఎల్బీ/ జిల్లా పరిపాలన పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్వచ్ఛత హి సేవా - పౌరుల పోర్టల్ https://swachhatahiseva.com/ ప్రత్యేకంగా- ఆర్కిటెక్చర్ చేయబడిన IT ప్లాట్‌ఫారమ్‌లో ప్రజల సమాచారం కోసం పరిశుభ్రత ఈవెంట్‌లు అందుబాటులో ఉంటాయి. పరిశుభ్రత సైట్‌లో, పౌరులు చిత్రాలను క్లిక్ చేయవచ్చు మరియు పోర్టల్‌లో కూడా అప్‌లోడ్ చేయవచ్చు. పౌరులు, ప్రభావశీలులు ఈ కార్యక్రమంలో చేరాలని మరియు స్వచ్ఛతా అంబాసిడర్‌లుగా మారడం ద్వారా ప్రజల ఉద్యమానికి నాయకత్వం వహించాలని ఆహ్వానించే విభాగాన్ని కూడా పోర్టల్ నిర్వహిస్తుంది. ఈ మెగా క్లీన్‌నెస్ డ్రైవ్ స్వచ్ఛతా పఖ్వాడా - స్వచ్ఛతా హి సేవ2023లో భాగంగా సెప్టెంబరు 15 నుండి అక్టోబరు 02 వరకు నిర్వహించబడుతుంది. పౌరులు పాత భవనాల పునరుద్ధరణ, నీటి వనరులు, ఘాట్‌లు, గోడలకు పెయింటింగ్‌లు వేయడం, రంగోళి పోటీలు నిర్వహించడం వంటి వివిధ పరిశుభ్రత కార్యక్రమాలను చేపట్టవచ్చు. పఖ్వాడా ప్రారంభించినప్పటి నుండి, ఇప్పటి వరకు 5కోట్ల మంది పౌరులు పఖ్వాడా కార్యక్రమంలో చేరారు.
***
(रिलीज़ आईडी: 1960437)
आगंतुक पटल : 226
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Khasi
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam