ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫ్రాన్స్ యొక్కఅధ్యక్షుని తో సమావేశమైన ప్రధాన మంత్రి

Posted On: 10 SEP 2023 11:30PM by PIB Hyderabad

ఫ్రెంచ్ గణతంత్రం అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయల్ మేక్రోన్ తో ప్రధాన మంత్రిశ్రీ నరేంద్ర మోదీ 2023 సెప్టెంబరు 10వ తేదీ నాడు న్యూ ఢిల్లీ లో జి-20 శిఖర సమ్మేళనం జరిగిన సందర్భం లో ఓ ద్వైపాక్షిక సమావేశం లో పాలుపంచుకొన్నారు. 2023 జులై 14వ తేదీ నాడు ఫ్రెంచ్ జాతీయ దినం సందర్భం లో ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమేన్యుయెల్ మేక్రోన్ ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి విశిష్ట అతిథి హోదా లో పాలుపంచుకొన్నారు. ఆయన 2023 జులై లో పేరిస్ కు వెళ్లారు. ఈ క్రమం లో భారతదేశం- ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క 25వ వార్షికోత్సవాన్ని కూడా జరపడమైంది. ఈ యాత్ర అనంతరం అధ్యక్షుడు శ్రీ మేక్రోన్ భారతదేశాని కి విచ్చేశారు.

జి-20 కి భారతదేశం ఫలప్రదం గా అధ్యక్షత ను వహించినందుకు గాను అధ్యక్షుడు శ్రీ మేక్రోన్ ప్రధాన మంత్రి కి అభినందనలను వ్యక్తం చేశారు. ఈ విషయం లో ఫ్రాన్స్ యొక్క సమర్థన కు గాను అధ్యక్షుని కి ప్రధాన మంత్రి ధన్యవాదాలను తెలియజేశారు.

నేతలు ఇద్దరు ద్వైపాక్షిక సంబంధాల ను గురించి, మరీ ముఖ్యం గా ‘హొరైజన్ 2047’, ఇండో--పసిఫిక్ రోడ్ మేప్ మరియు ప్రధాన మంత్రి ఇటీవలి యాత్ర అనంతరం ఒనగూరిన ఇతర ఫలితాల ను గురించి సమీక్ష ను నిర్వహించారు. రక్షణ, అంతరిక్షం పారిశ్రమిక మరియు స్టార్ట్- అప్ సంబంధి సహకారం, పరమాణు శక్తి, ఎస్ఎమ్ఆర్ మరియు ఎఎమ్ఆర్ సాంకేతికతలను సంయుక్తం గా అభివృద్ధి పరచడం, డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, క్రిటికల్ టెక్నాలజి, కనెక్టివిటి, శక్తి, జలవాయు పరివర్తన, విద్య, నేశనల్ మ్యూజియమ్ సంబంధి సహకారం, ప్రజల మధ్య పరస్పర సంబంధాలు వంటి రంగాల లో లక్ష్యాల సాధన కు సహకరించుకొనే అంశాలు కూడా చర్చ లో చోటు చేసుకొన్నాయి.

నేతలు ఉభయులు ఇండో- పసిఫిక్ ప్రాంతం సహా ముఖ్యమైనటువంటి అంతర్జాతీయ మరియు ప్రాంతీయ ఘటనక్రమాల పైన కూడా వారి అభిప్రాయాల ను ఒకరి తో మరొకరు వెల్లడి చేసుకొన్నారు. బహుపక్షీయ వాదం లో సంస్కరణ లు అవసరం అంటూ వారు నొక్కిపలికారు. ఇండియా-మిడిల్ ఈస్ట్- యూరోప్ ఇకానామిక్ కారిడర్ (ఐఎమ్ఇసి) ప్రకటన ను వారు స్వాగతించారు. ఐఎమ్ఇసి అమలు అయ్యేటట్టుగా కలసికట్టుగా పనిచేయాలి అని వారు సంకల్పాన్ని చెప్పుకొన్నారు.

భారతదేశం యొక్క చంద్రయాన్-3 మిశన్ సఫలం అయినందుకు ప్రధాన మంత్రి కి అభినందనల ను అధ్యక్షుడు శ్రీ మేక్రోన్ తెలియజేశారు. నేత లు ఇరువురు భారతదేశం- ఫ్రాన్స్ అంతరిక్ష సహకారాని కి ఆరు దశాబ్దాలు అయిన సంగతి ని గుర్తు కు తెచ్చుకొన్నారు.

 

***


(Release ID: 1956381) Visitor Counter : 166