ప్రధాన మంత్రి కార్యాలయం
బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనాతో ప్రధాన మంత్రి భేటీ
प्रविष्टि तिथि:
08 SEP 2023 7:46PM by PIB Hyderabad
బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ని ఆయన అధికారిక నివాసంలో కలిశారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ ప్రధాని భారత్ కు వచ్చారు.
'ప్రధాని షేక్ హసీనాతో ఫలవంతమైన చర్చలు జరిపాను. గత తొమ్మిదేళ్లుగా భారత్-బంగ్లాదేశ్ సంబంధాల పురోగతి చాలా సంతోషకరంగా ఉంది. కనెక్టివిటీ, కమర్షియల్ లింకేజీ తదితర అంశాలపై మా చర్చలు జరిగాయి.” అని శ్రీ మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు
పీఎంవో కూడా ఎక్స్ లో పోస్ట్ చేసింది.
'భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సహకారాన్ని విస్తృతం చేయడంపై బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో ప్రధాని @narendramodi ఫలవంతమైన చర్చలు జరిపారు. కనెక్టివిటీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు సహా పలు రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి వారు అంగీకరించారు.” అని పి ఎమ్ ఒ కూడా ఎక్స్ లో పోస్ట్ చేసింది.
*********
(रिलीज़ आईडी: 1955683)
आगंतुक पटल : 220
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam