ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

డిపిఐ నిర్వచనం,వ్యవస్థ, విధానాలపై ప్రపంచ స్థాయిలో ఏకాభిప్రాయం సాధించడంలో జీ-20 అధ్యక్ష హోదాలో భారతదేశం చారిత్రాత్మక విజయం సాధించింది.. కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్


సంపూర్ణ అభివృద్ధి సాధనలో ముఖ్యంగా ప్రపంచ దక్షిణాది దేశాలకు డిపిఐ అత్యంత కీలకంగా ఉంటుంది శ్రీ రాజీవ్ చంద్రశేఖర్

డిపిఐ లో భారతదేశం అనుసరిస్తున్న విధానాలు అనుసరించడానికి ఆర్థికంగా వెనుకబడిన దేశాలు సిద్ధంగా ఉన్నాయి... శ్రీ రాజీవ్ చంద్రశేఖర్

Posted On: 05 SEP 2023 3:10PM by PIB Hyderabad

డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (డిపిఐ) నిర్వచనం,వ్యవస్థ, విధానాలపై ప్రపంచ స్థాయిలో ఏకాభిప్రాయం సాధించడంలో జీ-20 అధ్యక్ష హోదాలో భారతదేశం చారిత్రాత్మక విజయం సాధించిందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఆగస్టు లో జరిగిన డిజిటల్ ఎకానమీ మంత్రుల సమావేశం తీసుకున్న ముఖ్యమైన వివరాలను మంత్రి ఈరోజు మీడియాకు వివరించారు.  భవిష్యత్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (డిపిఐ)ని ఎలా ప్రభావవంతంగా రూపొందించాలి అనే అంశంపై భారతదేశం అధ్యక్షతన జరిగిన   జి-20 డిజిటల్ ఎకానమీ మంత్రుల సమావేశం  సంచలనాత్మక ఏకాభిప్రాయానికి వచ్చిందని ఆయన వివరించారు. 

డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ , డిజిటల్ నైపుణ్యం  అంశాలపై ఏకాబ్రిప్రాయం సాధించడం ప్రధాన లక్ష్యంగా చర్చలు జరిగాయని మంత్రి తెలిపారు. 

"డిపిఐ కి సంబంధించి  మొట్టమొదటిసారిగా  ప్రపంచ స్థాయిలో దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. డిపిఐ   నిర్వచనం, వ్యవస్థ, విధానాల అంశంలో దేశాల మధ్య అవగాహన కుదిరింది. జీ-20 సమావేశాలు సందర్భంగా డిపిఐ కి మరింత ప్రాధాన్యత లభించింది. డిపిఐని అమలు చేయడానికి భారతదేశం అనుసరించిన విధానాలను ప్రపంచ దేశాలు అధ్యయనం చేస్తున్నాయి. అభివృద్ధి సాధించడానికి భారతదేశం  సాంకేతిక సాధనాలను విస్తృతంగా ఉపయోగించింది. భారతదేశం అమలు చేసిన డిపిఐని అమలు చేయడానికి వెనుకబడిన దేశాలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. భారతదేశం అమలు చేసిన  ఓపెన్ సోర్స్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ను అమలు చేసి భారతదేశం సాధించిన విజయాలను సాధించాలని మిగిలిన దేశాలు భావిస్తున్నాయి.  సంపూర్ణ అభివృద్ధి సాధనలో ముఖ్యంగా ప్రపంచ దక్షిణాది దేశాలకు డిపిఐ అత్యంత కీలకంగా ఉంటుంది అని జీ-20 సమావేశాలు గుర్తించాయి." అని  శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. 

ఆర్మేనియా, సియెర్రా లియోన్, సురినామ్, ఆంటిగ్వా, బార్బడోస్, ట్రినిడాడ్ , టొబాగో, పాపువా న్యూ గినియా,మారిషస్ వంటి దేశాలతో భారతదేశం ఎనిమిది అవగాహన ఒప్పందాలు  కుదుర్చుకుంది,  ఎటువంటి ఖర్చు లేకుండా, బహిరంగంగా ఇండియా స్టాక్, డిపిఐని అందించడానికి భారతదేశం అంగీకరించింది.  ఈ దేశాలు ఇప్పుడు ఈ వనరులను తమ దేశాలలో అమలు చేసి,ఉపయోగించుకుంటాయి. దీనివల్ల ఆయా దేశాల ఆవిష్కరణల రంగం అభివృద్ధి చెందుతుంది. 

డిపిఐతో సైబర్‌ సెక్యూరిటీ అంశానికి జీ-20 దేశాలు ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించాయని శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో  సైబర్‌ సెక్యూరిటీ కి అత్యంత ప్రాధాన్యత ఉంటుందన్నారు.  “ వ్యాపారాలకు రక్షణ కల్పించే అంశంలో సైబర్  సెక్యూరిటీ ప్రాధాన్యతను జీ-20 దేశాల మంత్రులు గుర్తించారు. దీనిపై విస్తృతంగా చర్చలు జరిగాయి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న సమయంలో  సైబర్‌ సెక్యూరిటీ అనేది ప్రపంచంలోని అన్ని దేశాలకు ముఖ్యమైన సమస్యగా మారింది" అని మంత్రి అన్నారు.

 డిజిటల్ నైపుణ్యాల అంశంలో కూడా జీ-20 దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.  కోవిడ్ అనంతర డిజిటల్ ప్రపంచంలో యువతలో డిజిటల్ నైపుణ్యాలను బోధించి, పెంపొందించడానికి దేశాలు తక్షణ చర్యలు అమలు చేయాల్సి ఉంటుందని  మంత్రి అన్నారు.

“కోవిడ్ అనంతర  డిజిటల్ ప్రపంచంలో డిజిటల్ నైపుణ్యాలు ఎక్కువగా అవసరం ఉంటాయి.యువతకు డిజిటల్ నైపుణ్యాలను అందించడానికి భారతదేశం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. జీ-20 దేశాలు భారతదేశం అనుసరిస్తున్న విధానాలను సమర్ధించాయి. రాబోయే టెక్‌కేడ్‌లో ఎదురయ్యే  సవాళ్లను ఎదుర్కోవడానికి డిజిటల్ సంసిద్ధత అవసరం.  భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోడానికి   నైపుణ్య ప్రతిభను అభివృద్ధి చేసేందుకు భారతదేశంతో కలిసి పనిచేయడానికి  అనేక దేశాలు  ఆసక్తి చూపుతున్నాయి, ”అని శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. 

 

***



(Release ID: 1955017) Visitor Counter : 133