ప్రధాన మంత్రి కార్యాలయం
స్మృతి వన్ప్రారంభ దినాన్ని గుర్తుకు తెచ్చుకొన్న ప్రధాన మంత్రి
కచ్ఛ్ లో స్మృతి వన్ నుసందర్శించవలసింది గా ప్రజల కు ఆయన విజ్ఞప్తి చేశారు
Posted On:
29 AUG 2023 8:32PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘స్మృతి వన్’ ను ప్రారంభించి న రోజు ను స్మరించుకొంటూ , గుజరాత్ లో 2001 వ సంవత్సరం లో సంభవించిన భూకంపం లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల కు మన:పూర్వక శ్రద్ధాంజలి ని సమర్పించారు.
శ్రీ నరేంద్ర మోదీ కిందటి సంవత్సరం లో తాను స్మృతి వన్ ను ప్రారంభించినప్పటి దృశ్యాల ను కొన్నిటిని శేర్ చేశారు.
కచ్ఛ్ లో నెలకొన్న స్మృతి వన్ ను అందరూ సందర్శించాలని ఆయన కోరారు.
సామాజిక మాధ్యం ‘X’ లో పొందుపరచిన మోదీ కథ అనే పోస్టు కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిబిస్తూ -
‘‘గుజరాత్ లో 2001 వ సంవత్సరం భూకంపం సంభవించిన కారణం గా ప్రాణాల ను కోల్పోయిన వారి కి హృదయపూర్వక శ్రద్ధాంజలి లా ‘స్మృతి వన్’ ను మనం ప్రారంభించుకొని అప్పుడే ఒక సంవత్సర కాలం అయిపోయింది. ఇది ఎటువంటి స్మారక చిహ్నం అంటే ఇది దు:ఖం నుండి సంబాళించుకొనే మరియు స్మృతి తాలూకు ప్రతీక గా కూడాను ఉన్నది. కిందటి సంవత్సరం తాలూకు దృశ్యాల ను కొన్నిటిని మీకు శేర్ చేస్తున్నాను; మరి మీరంతా కచ్ఛ్ లో స్మృతి వన్ కు వెళ్లవలసింది గా కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను..’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
(Release ID: 1953541)
Visitor Counter : 110
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam