ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గ్రీస్ కు చెందిన ప్రముఖ పరిశోధకుడు మరియు సంగీతకారుడు శ్రీ కాన్ స్టాంటిన్ నోస్ కాలాయెజిస్ తో సమావేశమైన ప్రధాన మంత్రి

Posted On: 25 AUG 2023 10:41PM by PIB Hyderabad

గ్రీసు దేశాని కి చెందిన పరిశోధకుడు, సంగీతకారుడు మరియు భారతదేశాని కి మిత్రుడు శ్రీ శ్రీ కాన్ స్టాంటిన్ నోస్ కాలాయెజిస్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 25 వ తేదీ నాడు ఏథెన్స్ లో సమావేశమయ్యారు.


భారతదేశమన్నా, భారతదేశ సంగీతమన్నా, భారతదేశ నృత్య‌మన్నా శ్రీ కాన్ స్టాంటిన్ నోస్ కాలాఎజిస్ కు ఉన్న మక్కువ ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. 2022 వ సంవత్సరం నవంబర్ 27 వ తేదీ నాడు ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం యొక్క 95 వ సంచిక లో ఈ కళాకారుని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు.

ఇరువురు గ్రీస్ లో భారతీయ సంస్కృతి ని మరింత ప్రజాదరణ పాత్రం గా చేసేందుకు గల అవకాశాల ను గురించి చర్చించారు.

 

 

**


(Release ID: 1952895) Visitor Counter : 111