ప్రధాన మంత్రి కార్యాలయం
బ్రిక్స్ 15వ సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి
Posted On:
23 AUG 2023 8:44PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 23న దక్షిణాఫ్రికా అధ్యక్షతన జోహాన్నెస్‌బర్గ్ లో ప్రారంభమైన ‘బ్రిక్స్’ 15వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, ఆఫ్రికాసహా దక్షిణార్థ గోళ దేశాలతో భాగస్వామ్యం తదితర అంశాలపై కూటమి దేశాల అధినేతలు ఈ సందర్భంగా చర్చించారు. అలాగే ‘బ్రిక్స్’ కార్యాచరణ జాబితాలోని అంశాల అమలులో ఇప్పటిదాకా పురోగతిని వారు సమీక్షించారు.
ప్రధానమంత్రి తన ప్రసంగంలో భాగంగా- మరింత బలమైన ‘బ్రిక్స్’ కోసం ముందడుగు వేయాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ కూటమికి కొత్త నిర్వచనం ఇచ్చారు. ఈ మేరకు:
బి - అవరో్ధాలను అధిగమించడం (బ్రేకింగ్ బారియర్స్)
ఆర్- ఆర్థిక వ్యవస్థలకు పునరుత్తేజం (రీవైటలైజింగ్ ఎకానమీస్)
ఐ – ఆవిష్కరణ స్ఫూర్తి (ఇన్‌స్పైరింగ్ ఇన్నొవేషన్)
సి – అవకాశాల సృష్టి (క్రియేటింగ్ ఆపర్చునిటీస్)
ఎస్- భవిష్యత్తుకు రూపం (షేపింగ్ ది ఫ్యూచర్)
అదేవిధంగా వివిధ చర్యలకు సంబంధించి కింది అంశాలను ప్రధానమంత్రి నొక్కిచెప్పారు:
- ఐక్యరాజ్య సమితి భద్రత మండలి సంస్కరణలకు నిర్దిష్ట గడువు విధింపు
- బహుపాక్షిక ఆర్థిక సంస్థలలో సంస్కరణలు
- ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ)కు సంస్కరణలు
- బ్రిక్స్ విస్తరణపై ఏకాభిప్రాయ సాధన
- బ్రిక్స్ ద్వారా ప్రపంచానికి విభజిత దృక్కోణం కాకుండా ఐక్యత సందేశం పంపడం
- బ్రిక్స్ అంతరిక్ష పరిశోధన సమాఖ్య ఏర్పాటుకు ప్రతిపాదన
- భారత డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు- ‘ఇండియన్ శ్టాక్స్’ను బ్రిక్స్ భాగస్వాములతో పంచుకోవడానికి సంసిద్ధత.
- నైపుణ్యాల గుర్తింపు.. శిక్షణ.. బ్రిక్స్ దేశాల మధ్య నిపుణ మానవ వనరుల ఆదానప్రదానాలకు ప్రతిపాదన
- ‘అంతర్జాతీయ పులిజాతి సంరక్షణ కూటమి’ ఒప్పందం కింద వాటి సంరక్షణకు బ్రిక్స్ సంయుక్త కృషిపై ప్రతిపాదన
- బ్రిక్స్ దేశాల మధ్య సంప్రదాయ వైద్యవిధానాల భాండాగారం ఏర్పాటుకు ప్రతిపాదన
- జి-20లో ఆఫ్రికా సమాఖ్యకు శాశ్వత సభ్యత్వంపై బ్రిక్స్ మద్దతుకు పిలుపు
*****
(Release ID: 1951968)
Visitor Counter : 197
Read this release in:
Marathi
,
Hindi
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
Bengali
,
Manipuri
,
Odia