ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చంద్రయాన్-3 విజయం 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు.. సామర్థ్యాలకు ప్రతిబింబం: ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 23 AUG 2023 7:25PM by PIB Hyderabad

   చంద్రయాన్-3 విజయం 140 కోట్లమంది భారతీయుల ఆకాంక్షలు.. సామర్థ్యాలకు ప్రతిబింబమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ సందేశాన్ని ప్రజలతో పంచుకుంటూ:

“చంద్రయాన్-3 విజయం 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు, సామర్థ్యాలకు అద్దం పడుతుంది. సరికొత్త దిగంతంలోకి.. అంతరిక్షం అంచులకు మన పయనం భారతదేశం గర్వించదగిన క్షణం!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1951966) आगंतुक पटल : 165
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam