ప్రధాన మంత్రి కార్యాలయం
త్రివర్ణ పతాకంతో దిగిన ఫొటోల ను ‘హర్ ఘర్ తిరంగా’ లో అప్ లోడ్ చేయవలసింది గా పౌరుల కు విజ్ఞప్తిచేసిన ప్రధాన మంత్రి
Posted On:
11 AUG 2023 8:41PM by PIB Hyderabad
ఆగస్టు 13వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ మధ్య కాలం లో ‘హర్ ఘర్ తిరంగా’ ఉద్యమం లో భాగం గా త్రివర్ణ పతాకం తో దిగిన ఫొటోల ను harghartiranga.com లో అప్ లోడ్ చేయవలసింది అంటూ పౌరుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.
ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -
‘‘ ‘‘హర్ ఘర్ తిరంగా’’ ఉద్యమం ఆజాదీ కే అమృత్ మహోత్సవ్ లో ఒక క్రొత్త శక్తి ని నింపివేసింది. ఈ సంవత్సరం లో ఈ ఉద్యమాన్ని దేశ ప్రజలు ఒక సరిక్రొత్త ఎత్తు కు చేర్చవలసి ఉంది. రండి, ఆగస్టు 13వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ మధ్య కాలం లో దేశం యొక్క పేరు ప్రతిష్టల చిహ్నం గా జాతీయ జెండా ను రెపరెపలాడించుదాం. త్రివర్ణ పతాకం తో మీరు ఉన్న సెల్ఫీ ని harghartiranga.com లో తప్పక అప్ లోడ్ చేయగలరు.’’
‘‘స్వాతంత్ర్యానికి మరియు జాతీయ ఏకత అనే భావాల కు ప్రతీక గా త్రివర్ణ పతాకం ఉంది. భారతదేశం లో ప్రతి ఒక్కరు మువ్వన్నెల జెండా తో భావనాత్మకమైనటువంటి అనుబంధాన్ని కలిగివున్నారు; అంతేకాకుండా, ఈ జెండా మనలను దేశ ప్రగతి ని ముందుకు తీసుకు పోవడం కోసం కఠోరంగా శ్రమించండంటూ ప్రేరితులను చేస్తుంది కూడాను. ఆగస్టు 13వ తేదీ నాటి నుండి ఆగస్టు 15వ తేదీ మధ్య కాలం లో #HarGharTiranga ఉద్యమం లో పాలుపంచుకోండంటూ మీ అందరి కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తిరంగా తో పాటుగా మీరు దిగిన ఛాయాచిత్రాల ను harghartiranga.com లో అప్ లోడ్ చేయగలరు.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1950712)
Visitor Counter : 134
Read this release in:
Manipuri
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam