ప్రధాన మంత్రి కార్యాలయం
ఇంటింటా త్రివర్ణం" స్ఫూర్తితో సామాజిక మాధ్యమ ఖాతాల వ్యక్తిగత చిత్రం మార్చాలని ప్రజలకు ప్రధాని పిలుపు
प्रविष्टि तिथि:
13 AUG 2023 10:32AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని తన సామాజిక మాధ్యమ ఖాతాల వ్యక్తిగత చిత్రంగా పెట్టుకున్నారు. "ఇంటింటా త్రివర్ణం" స్ఫూర్తితో జాతీయ పతాకాన్ని ప్రజలందరూ తమ సామాజిక మాధ్యమ చిత్రంగా పెట్టుకోవాలని సూచించారు. ఆగస్టు 13-15 తేదీల మధ్య దేశవ్యాప్తంగా "ఇంటింటా త్రివర్ణం" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రధాని ఒక ట్వీట్ ద్వారా ఈ మేరకు సందేశమిచ్చారు. "#HarGharTiranga ఉద్యమ స్ఫూర్తితో మన సోషల్ మీడియా ఖాతాల చిత్రాన్ని మారుద్దాం. తద్వారా మన ప్రియమైన దేశం... దేశ మాతతో మన అనుబంధం మరింత పెనవేసుకునేలా ఈ ప్రత్యేక కార్యక్రమానికి మద్దతిద్దాం" అని పిలుపునిచ్చారు.
***
DS
(रिलीज़ आईडी: 1948397)
आगंतुक पटल : 227
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
Manipuri
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam