ఆర్థిక మంత్రిత్వ శాఖ
విపత్తు స్పందన కోసం రాష్ట్రాలకు రూ.7,532 కోట్లు విడుదల చేసిన కేంద్రం
భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా తక్షణమే రాష్ట్రాలకు నిధులు అందించేందుకు మార్గదర్శకాల సడలింపు
Posted On:
12 JUL 2023 4:03PM by PIB Hyderabad
ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం ఈరోజు సంబంధిత స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ (ఎస్డిఆర్ఎఫ్) కోసం 22 రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.7,532 కోట్లు విడుదల చేసింది. హోం మంత్రిత్వ శాఖ సిఫారసుల మేరకు ఈ మొత్తాన్ని విడుదల చేసింది. రాష్ట్రాల వారీగా విడుదలైన మొత్తం వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
(రూ.కోట్లలో)
వరుస సంఖ్య
|
రాష్ట్రం
|
నిధులు
|
1. |
ఆంధ్రప్రదేశ్
|
493.60
|
|
అరుణాచల్ ప్రదేశ్
|
110.40
|
|
అస్సాం
|
340.40
|
|
బీహార్
|
624.40
|
|
ఛత్తీస్గఢ్
|
181.60
|
|
గోవా
|
4.80
|
|
గుజరాత్
|
584.00
|
|
హర్యానా
|
216.80
|
|
హిమాచల్ ప్రదేశ్
|
180.40
|
|
కర్ణాటక
|
348.80
|
|
కేరళ
|
138.80
|
|
మహారాష్ట్ర
|
1420.80
|
|
మణిపూర్
|
18.80
|
|
మేఘాలయ
|
27.20
|
|
మిజోరాం
|
20.80
|
|
ఒడిశా
|
707.60
|
|
పంజాబ్
|
218.40
|
|
తమిళ నాడు
|
450.00
|
|
తెలంగాణ
|
188.80
|
|
త్రిపుర
|
30.40
|
|
ఉత్తరప్రదేశ్
|
812.00
|
|
ఉత్తరాఖండ్
|
413.20
|
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు అందించిన మొత్తానికి సంబంధించిన వినియోగ ధృవీకరణ పత్రం కోసం ఎదురు చూడకుండా మార్గదర్శకాలు సడలించి, తక్షణ సాయంగా రాష్ట్రాలకు ఆ మొత్తాన్ని విడుదల చేసింది.
విపత్తు నిర్వహణ చట్టం, 2005లోని సెక్షన్ 48 (1) (a) ప్రకారం ప్రతి రాష్ట్రంలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డిఆర్ఎఫ్) ఏర్పాటు అయింది. నోటిఫై చేసిన విపత్తుల ప్రతిస్పందనల కోసం రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్న ప్రాథమిక నిధి ఈ ఫండ్. కేంద్ర ప్రభుత్వం సాధారణ రాష్ట్రాలకు 75%, ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు 90% ఎస్డిఆర్ఎఫ్ కి అందిస్తుంది.
ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు ప్రకారం వార్షిక కేంద్ర సహకారం రెండు సమాన వాయిదాలలో విడుదల అవుతుంది. మార్గదర్శకాల ప్రకారం, అంతకుముందు విడతలో విడుదల చేసిన మొత్తానికి యుటిలైజేషన్ సర్టిఫికేట్, ఎస్డిఆర్ఎఫ్ నుండి చేపట్టిన కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వం నుండి నివేదిక అందిన తర్వాత నిధులు విడుదల చేస్తారు. అయితే అత్యవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి నిధులు విడుదల చేసే సమయంలో ఈ అవసరాలను మినహాయించారు.
తుఫాను, కరువు, భూకంపం, అగ్నిప్రమాదం, వరదలు, సునామీ, వడగళ్ల వాన, కొండచరియలు విరిగిపడటం, హిమపాతం, తెగుళ్ల దాడి, మంచు, చలి వంటి నోటిఫైడ్ విపత్తుల బాధితులకు తక్షణ సాయం అందించడానికి మాత్రమే ఎస్డిఆర్ఎఫ్ ఉపయోగించబడుతుంది. .
రాష్ట్రాలకు ఎస్డిఆర్ఎఫ్ నిధుల కేటాయింపు గత వ్యయం, ప్రాంతం, జనాభా, విపత్తు ప్రమాద సూచిక వంటి బహుళ కారకాలపై ఆధారపడి ఉంటుంది. ఈ కారకాలు రాష్ట్రాల సంస్థాగత సామర్థ్యం, రిస్క్ ఎక్స్‌పోజర్, ప్రమాదం, దుర్బలత్వాన్ని ప్రతిబింబిస్తాయి.
15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 2021-22 నుండి 2025-26 సంవత్సరాలకు ఎస్డిఆర్ఎఫ్ కోసం రూ.1,28,122.40 కోట్లు కేటాయించింది. ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.98,080.80 కోట్లు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే రూ.34,140.00 విడుదలచేసింది. ప్రస్తుత విడుదలతో, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటివరకు విడుదల చేసిన ఎస్‌డిఆర్‌ఎఫ్‌లో కేంద్ర వాటా మొత్తం రూ. 42,366 కోట్లు.
****
(Release ID: 1939116)
Visitor Counter : 174
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada