ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వ్యాపార రంగ ప్రముఖుడు శ్రీ ఎలోన్ మస్క్ తో సమావేశమైన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 21 JUN 2023 8:22AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాంకేతిక విజ్ఞాన రంగం లో అగ్రగామి వ్యక్తి, వ్యాపార రంగ ప్రముఖుడు మరియు టెస్లా ఇంక్. ఎండ్ స్పేస్ ఎక్స్ ల యొక్క సిఇఒ; ట్విటర్ కు యజమాని, సిటిఒ, ఇంకా చెయర్ మన్; బోరింగ్ ఎండ్ ఎక్స్-కార్ప్ ల వ్యవస్థాపకుడు, న్యూరాలింక్ మరియు ఒపెన్ఎఐ ల సహ వ్యవస్థాపకుడైన శ్రీ ఎలోన్ మస్క్ తో యుఎస్ఎ లోని న్యూ యార్క్ లో ఈ రోజు న సమావేశమయ్యారు.

 

వేరు వేరు రంగాల లో సాంకేతిక విజ్ఞానాన్ని సులభం గాను మరియు తక్కువ ఖర్చు లోను అందుబాటు లోకి తీసుకు వచ్చే దిశ లో ప్రయత్నాల ను చేస్తూ ఉన్నందుకు గాను శ్రీ మస్క్ ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. భారతదేశం లో ఇలెక్ట్రిక్ మొబిలిటీ రంగం లో మరియు శరవేగం గా విస్తరిస్తున్న వాణిజ్య తరహా ప్రయోజనాల తో కూడినటువంటి అంతరిక్ష రంగం లో పెట్టుబడుల ను పెట్టేందుకు ఏయే అవకాశాలు ఉన్నదీ అన్వేషించండంటూ శ్రీ మస్క్ ను ప్రధాన మంత్రి ఆహ్వానించారు.

 

***


(रिलीज़ आईडी: 1934053) आगंतुक पटल : 178
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam