ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ పురావస్తు దినోత్సవం నేపథ్యంలో పురావస్తు సంరక్షణ ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పిన ప్రధానమంత్రి

Posted On: 09 JUN 2023 7:06PM by PIB Hyderabad

   ముచిత పురావస్తు సంరక్షణ ఆవశ్యకత, మన వారసత్వ-విజ్ఞానాల పరిరక్షణలో దానికిగల ప్రాధాన్యం గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు.

అంతర్జాతీయ పురావస్తు దినోత్సవం సందర్భంగా జాతీయ పురావస్తు సంస్థ (ఎన్‌ఎఐ) నిర్వహించిన ప్రదర్శనపై వరుస ట్వీట్లకు స్పందిస్తూ పంపిన సందేశంలో:

“సముచిత పురావస్తు సంరక్షణ అన్నది మన వారసత్వం, విజ్ఞానాల పరిరక్షణపై మన నిబద్ధతకు గీటురాయి. గతంతో భవిష్యత్తరాల అనుసంధానానికి, మన సమష్టి జ్ఞాన వికాసం కొనసాగింపునకు ఇది దన్నుగా నిలుస్తుంది. మన చరిత్రను శ్రద్ధగా కాపాడే మన పురావస్తు నిపుణులను ఈ సందర్భంగా గౌరవించుకుందాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(Release ID: 1931364) Visitor Counter : 183