ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా కప్‌ పురుషుల జూనియర్‌ హాకీ: భారత జట్టు విజయంపై ప్రధాని అభినందన

నాడు పోస్టు చేయడమైనది: 02 JUN 2023 6:22PM by PIB Hyderabad

   సియా కప్ పురుషుల జూనియర్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు విజయం సాధించడంపై ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా కప్ పురుషుల జూనియర్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు అద్భుత విజయం సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు. వారు సాధించిన విజయం మన యువతలో వర్ధిల్లుతున్న ప్రతిభను, దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తోంది. వారు భారతదేశం మరింత గర్వపడేలా చేశారు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1929610) సందర్శకుల సూచీ సంఖ్య : : 175