సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

యువశక్తికి సాధికారత కల్పించడం ద్వారా భారతదేశం గత తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతిని జాతీయ సదస్సు వివరించింది.

Posted On: 27 MAY 2023 5:46PM by PIB Hyderabad

సమాజంలోని వివిధ వర్గాల పౌరులు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో “యువశక్తి: గాల్వనైజింగ్ ఇండియా” అనే సెషన్‌లో గత తొమ్మిదేళ్లలో యువత సాధికారతకు ప్రభుత్వ విధానాలు మరియు కార్యక్రమాలు ఎలా దోహదపడ్డాయనే అంశంపై చర్చించారు. ప్రసార భారతి నిర్వహించిన “నేషనల్ కాన్‌క్లేవ్: 9 సాల్ -సేవా, సుశాసన్, గరీబ్ కళ్యాణ్” సదస్సులో ఈ సెషన్ జరిగింది. ఎస్ప్రెస్సో టెక్నాలజీస్ డైరెక్టర్ యశోధర బజోరియా, ఓయో రూమ్స్ సీఈవో రితేశ్ అగర్వాల్, ఇండియన్ హాకీ మాజీ కెప్టెన్ విరెన్ రాస్కిన్హా, బాక్సర్ అఖిల్కుమార్, సంగీతకారుడు అమన్ అలీ బంగాష్, నటుడు రిషబ్ శెట్టి తదితరులు ప్యానెలిస్టులలో ఉన్నారు. రెడ్ ఎఫ్ ఎమ్ రేడియో జాకీ రౌనక్ ఈ సెషన్ను మోడరేటర్గా వ్యవహరించారు.
‘‘పారిశ్రామికవేత్తలకు సంస్థాగత మద్దతు ఇచ్చిన ప్రభుత్వానికే ఈ కీర్తి దక్కుతుంది’’

ఎస్ప్రెస్సో టెక్నాలజీస్ డైరెక్టర్ యశోధర బజోరియా మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంలో స్టాండ్ అప్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా వంటి పథకాలు పెద్ద పాత్ర పోషించాయని అన్నారు. తన వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ చేసుకుంటున్న ఓ మహిళ విజయగాథను ఉదాహరణగా చెప్పిన బజోరియా.. డిజిటల్ వాణిజ్యం కోసం ఓపెన్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు.   “రైతు ఉత్పాదక సంస్థలు మరియు స్వయం సహాయక సంఘాలు రైతులకు మరియు మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు కూడా క్షేత్రస్థాయి మద్దతునిచ్చాయి. ప్రజలకు ఈ రకమైన మద్దతును సంస్థాగతీకరించినందుకు, చిన్న పారిశ్రామికవేత్తలకు కూడా ఒక స్థాయి అవకాశాలు కల్పించిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుంది’’.

"మన జీవితంలో భాగమైన వివిధ ఆవిష్కరణల ఆవిర్భావానికి ప్రభుత్వ విధానాలు  దారితీశాయి"

ఓయో రూమ్స్ సీఈఓ రితేశ్అగర్వాల్ మాట్లాడుతూ..  నేడు మన నిత్య జీవితంలో భాగమైన వివిధ సేవలు తొమ్మిదేళ్ల క్రితం కూడా లేవని అన్నారు. “యువశక్తితో నడుస్తున్న స్టార్టప్ లతో భారతదేశం వేగంగా ఎదుగుతోంది. మనమిప్పుడు ప్రపంచంలోనే మెరుగైన స్థానంగా ఉన్నామన్నారు.

"అట్టడుగు స్థాయిలో క్రీడా మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టడంలో ప్రభుత్వం గొప్ప పని చేసింది"

టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు ఉండడం ఇది గొప్ప క్షణమని భారత హాకీ మాజీ కెప్టెన్ విరెన్ రస్కిన్హా అన్నారు. “టోక్యో ఒలింపిక్స్‌లో క్రీడల్లో నాకు అతిపెద్ద విషయమేమిటంటే.. నాల్గవ స్థానంలో నిలిచి కేవలం పతకానికి దూరమైన భారత మహిళల హాకీ జట్టు ప్రదర్శన. 2016 మరియు 2021 మధ్య క్షేత్రస్థాయిలో చాలా పెట్టుబడులు వచ్చాయి. ఆస్ట్రో-టర్ఫ్ పిచ్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది. క్రీడా మౌలిక సదుపాయాలు చాలా అభివృద్ధి చెందాయి. అయినప్పటికీ మనం సాధించాల్సింది చాలా ఉంది. హాకీ ఒక భౌతిక శక్తి క్రీడగా మారింది. నైపుణ్యంలో ప్రపంచంలోని అత్యుత్తమ దేశాలతో మనం ఎల్లప్పుడూ సరిపోలవచ్చు.  ఫిట్‌నెస్ మరియు శక్తి విషయంలో మనం కష్టపడుతున్నాము. ఇది మేము గణనీయమైన పురోగతిని సాధించిన ఒక ప్రాంతం. చిన్న గ్రామాల బాలికలు ఒలింపిక్స్‌లో ప్రదర్శనలు ఇవ్వడం లక్షలాది మంది యువతులకు గర్వకారణం, ఎంతోమందిలో  ఇది స్ఫూర్తి నింపుతుంది. క్షేత్రస్థాయిలో పెట్టుబడులకు ప్రభుత్వం పెద్ద పీట వేయడం గొప్ప పరిణామం.

ఫిట్ ఇండియా మరియు ఖేలో ఇండియా అనే భావనలు రెండు పరివర్తన కార్యక్రమాలుగా ఉన్నాయని, ఇవి క్రీడా సంస్కృతి మరియు స్పోర్ట్స్ కోచ్‌ల యొక్క రెండు సీ లను సూచిస్తాయని ఆయన అన్నారు. "క్రీడ నాకు జీవితంలో చాలా నేర్పింది, క్రీడలు మనకు నేర్పించే అతిపెద్ద విషయం ఓటమిని అంగీకరించడం మరియు నేర్చుకోవడం మరియు మెరుగుపరచడం." సైన్స్ టీచర్‌తో సమానంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌ స్థాయిని పెంచగలిగితేనే మనం నిజంగా క్రీడలను మార్చగలమని  అన్నారు.

"ఖేలో ఇండియా మరియు ఫిట్ ఇండియా వంటి పథకాలతో భారతీయ క్రీడాకారుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది"

ప్రధాన టోర్నమెంట్‌లకు ముందు ప్రధానమంత్రి క్రీడాకారులతో సమావేశమై వారితో సంభాషించినప్పుడు..  అది ఆటగాళ్లకు చాలా అంతర్గత ప్రేరణనిస్తుందని బాక్సర్ అఖిల్ కుమార్ అన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు క్రీడా సంస్కృతిని పెంపొందించుకోవాలని అన్నారు. ఫిట్‌నెస్ మరియు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో ఫిట్ ఇండియా ఉద్యమం యొక్క పాత్రను ఆయన అభినందించారు. క్రీడాకారులకు ఆర్థిక సహాయం యొక్క ప్రాముఖ్యతను కూడా అతను నొక్కి చెప్పాడు, ఇది వారి ఆర్థిక స్థితి గురించి ఆలోచించేలా చేయడమే కాదు... క్రీడలను కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. ఖేలో ఇండియా వంటి సాధికారత పథకాలతో భారత క్రీడాకారులకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు.

"చిన్న గ్రామాలు మరియు పట్టణాల నుండి ప్రతిభను ప్రోత్సహించడంలో ప్రభుత్వం గొప్పగా చేసింది"

యువ తరానికి ప్రభుత్వం ఎంతో చేస్తోందని సంగీత విద్వాంసుడు అమన్ అలీ బంగాష్ అన్నారు. చిన్న చిన్న గ్రామాలు, పట్టణాల్లోని ప్రతిభావంతులైన యువతను ప్రభుత్వం  ప్రోత్సహించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. భారతదేశానికి ఇదికీలకమైన సమయమని, అన్ని రకాల కళలు మరియు సంస్కృతిపై అవగాహన గణనీయంగా పెరిగిందని ఆయన అన్నారు.

భారతదేశ విశిష్టమైన కథలను ప్రపంచానికి అందించాలని చిత్ర నిర్మాతలను ప్రధాని కోరారు.

సినీ నటుడు రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. సినిమా ప్రజలకు చేరువ కావడానికి బలమైన మాధ్యమంగా మారిందని అన్నారు. “ఇంతకుముందు, చాలా సినిమాలు మన దేశాన్ని ప్రతికూలంగా చిత్రీకరించేవి. మన దేశాన్ని సానుకూలంగా చూపించడం ముఖ్యం అని నేను భావిస్తున్నాను. విశిష్ట విశ్వాసాలు, జీవన విధానాలు, ఆచారాలు మరియు ఆహారంలో ప్రతిబింబించే విధంగా మన గ్రామాలకు సంబంధించిన విశిష్ట కథలను బయటకు తీసుకురావాలనేది నా ఆలోచన.

 

***



(Release ID: 1928053) Visitor Counter : 138