సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

‘పై పై సే గరీబ్ కీ భలై’ అనే సిద్ధాంతంతో ప్రభుత్వం పని చేస్తోంది: కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్


నేషనల్ కాన్క్లేవ్‌: 9 సాల్ – సేవ, సుశాసన్, గరీబ్ కళ్యాణ్ ను ప్రారంభించిన శ్రీ అశ్విని వైష్ణవ్

9 సంవత్సరాలలో భారతదేశం దుర్బలమైన ఐదు నుండి మొదటి ఐదు స్థానాలకు చేరుకుంది: కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్

ప్రధాని మోదీ త్రివర్ణ పతాకాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జెండాగా మార్చారు: శ్రీ ఠాకూర్

Posted On: 27 MAY 2023 4:33PM by PIB Hyderabad

కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ఈరోజు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నేషనల్ కాన్క్లేవ్: 9 సాల్ - సేవ, సుశాసన్, గరీబ్ కళ్యాణ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, కేంద్ర సమాచార,  ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐ అండ్ బి మంత్రిత్వ శాఖ కార్యదర్శి  శ్రీ అపూర్వ చంద్ర, ప్రసార భారతి సిఇఒ శ్రీ గౌరవ్ ద్వివేది కూడా పాల్గొన్నారు.

 

కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ 2014కి ముందు ప్రభుత్వాల పనితీరును ప్రస్తుత ప్రభుత్వంతో తులనాత్మక ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. గత పాలనా ప్రయత్నాలు స్కామ్‌లకు పర్యాయపదాలుగా మారాయని, ప్రస్తుత ప్రభుత్వం 'పై పై సే గరీబ్ కీ భలై' (ప్రతి పైసా పేదల ప్రయోజనం కోసం) అనే సిద్ధాంతంతో పనిచేస్తోందని అన్నారు. పేదలు, నిరుపేదలను కేంద్ర స్తంభాలుగా పథకాలు కార్యక్రమాలు అమలవుతున్నాయని అన్నారు. 

సొంత ఇల్లు అనేది పేదవాడి జీవితంలో మార్పు తెచ్చే అంశం అని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ దిశగా నేడు పేదల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చేందుకు పీఎం ఆవాస్ యోజన కింద దేశంలో 3.5 కోట్ల ఇళ్లను నిర్మించామని తెలిపారు. 

ప్రతి ఇంటికి పైప్‌ వాటర్‌ కనెక్షన్‌ ఇవ్వాలనే ఆలోచనను ఎప్పుడూ ఒక మహాద్భుతంగా పరిగణిస్తున్నామని, అది ఎప్పటికీ సాధ్యం కాలేదని మంత్రి అన్నారు. కానీ, ప్రధాని దీనిని సవాలుగా స్వీకరించారని, నేడు 12 కోట్ల మందికి నీటి కనెక్షన్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో, సాంప్రదాయ చుల్హాలకు చరమగీతం పలకడానికి ప్రభుత్వం కృషి చేసిందని, 9.6 కోట్ల కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లను అందించిందని ఆయన అన్నారు.

ప్రజల అవసరాలను తీర్చడం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి ఆయన మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి కష్టాలను ఎదుర్కోవడానికి ప్రపంచం పోరాడుతున్నప్పుడు, ప్రభుత్వం 80 కోట్ల మందికి ఉచిత రేషన్ తీసుకురావడానికి భారీ రవాణా సవాళ్లను అధిగమించిందని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాలలో సమ్మిళిత వృద్ధికి సూచికలైన మరుగుదొడ్ల వంటి ప్రాథమిక మానవ అవసరాల గురించి గతంలో ఏ ప్రభుత్వమూ మాట్లాడలేదు. అయితే ఎర్రకోట నుంచి తన ప్రసంగంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణం గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. దీంతో నేడు 11.72 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణంతో మహిళా భద్రత, పారిశుద్ధ్య రంగంలో విప్లవం ఏర్పడింది.

శ్రీ వైష్ణవ్ మాట్లాడుతూ భారతదేశం నేడు ఆయుష్మాన్ భారత్ కింద ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ బీమా కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, ఇది నిరుపేదలకు రూ. ఐదు లక్షల వరకు ఉచిత మెడికేర్‌ను అందించిందని, మొత్తం కవరేజీ అమెరికా, రష్యా జనాభా కంటే ఎక్కువని తెలిపారు.

శ్రీ వైష్ణవ్ సాంఘిక న్యాయానికి కొత్త నిర్వచనం చెప్పి,  సాధికారత దిశగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే ఘనత ప్రధాన మంత్రికి దక్కిందని ఆయన తెలిపారు.

దేశీయ మౌలిక సదుపాయాలలో 2014 నుండి అపూర్వమైన మార్పులు చోటుచేసుకున్నాయని, గతంలో సరైన ఆలోచనా విధానం లేకపోవడం వల్ల ఇది చాలావరకు కనిపించకుండా పోయిందని మంత్రి అన్నారు. 9 ఏళ్లలో 74 విమానాశ్రయాలను ఏర్పాటు చేశామని, 2014 పూర్వం మొత్తం సృష్టించిన సంఖ్యకు ఇది సమానమని  ఆయన ఉదహరించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి 91 వేల కిలోమీటర్ల రహదారిని వేస్తె, 2014 నుండి దాదాపు 54 వేల కిలోమీటర్ల రహదారిని నిర్మించారని చెప్పారు. భారతదేశంలో అసలు జలమార్గాలే లేని స్థితి నుండి  నేడు 111 జలమార్గాలను కలిగి ఉన్నాయని తెలిపారు.  భారతదేశంలోని రైల్వే స్టేషన్లు విమానాశ్రయాల వంటి ప్రపంచ స్థాయి సౌకర్యాలను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. . 

ప్రపంచ ఆర్థిక ర్యాంకింగ్ లలో  భారతదేశం చాలా కాలం వెనుకబడి ఉందని, కానీ నేడు భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని మంత్రి అన్నారు. భారతదేశం మరో రెండేళ్లలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, మరో ఆరేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని ఆయన అన్నారు. జాతీయ భద్రత పట్ల ప్రభుత్వ దృఢ నిబద్ధత గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గతంలో భారతదేశం ఎప్పుడొచ్చిందని అన్నారు. తీవ్రవాద కార్యకలాపాలకు ముగింపు పలుకుతున్నందున, ఈ రోజు దేశం...  దాడులకు ప్రతిస్పందించడానికి మార్గాలను, సత్తాను కలిగి ఉందని తెలిపారు. 

శ్రీ అనురాగ్ ఠాకూర్ కాన్క్లేవ్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ... గత తొమ్మిదేళ్లలో భారతదేశంలోని సామాన్య ప్రజల జీవితంలో అనూహ్యమైన మార్పు వచ్చిందని, ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల అంచనాలను మించిపోయాయని అన్నారు. గతంలో అవినీతితో కూరుకుపోయిన భారతదేశం బలహీనమైన, దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థగా ఉంటే, నేడు అది బలహీనమైన ఐదు స్థానాల నుండి ప్రపంచంలోని మొదటి ఐదు ఆర్థిక వ్యవస్థల సరసన చేరుకుందని సోదాహరణగా చెప్పారు.

 

గతంలో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కొందరికే అందేవని, నేడు ప్రభుత్వం అంత్యోదయ నినాదంతో పనిచేస్తోందని, ఇక్కడ క్యూలో చివరన ఉన్న వ్యక్తి  అభ్యున్నతికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. 27% మంది ప్రజలను పేదరికం నుండి బయటికి తీసుకొచ్చిన మా ప్రయత్నాల వెనుక ఉన్న అసలు కారణం ఇదే అని అన్నారాయన. సేవా భావం, గొప్ప ఆలోచనలు, సుపరిపాలన, సాంకేతికతను విస్తృతంగా వినియోగించడం, వాటిని సక్రమంగా అందరికీ అందేలా పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడం వంటివి ప్రజా సేవల చివరి-మైలు వరకు చేరుకునేలా నిర్ధారిస్తాయనై కేంద్ర మంత్రి అన్నారు.

వలసవాద గత వారసత్వాలను తొలగించి ఆధునిక, దేశీయ చిహ్నాలను స్వీకరించడంలో ప్రభుత్వం దృఢంగా వ్యవహరిస్తోందని మంత్రి అన్నారు. కర్తవ్య పథం సృష్టిలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది ... కొత్త పార్లమెంటులో ఇది స్పష్టంగా కనిపిస్తుంది అని కేంద్ర మంత్రి తెలిపారు. 
ఈ దేశ భ‌విష్య‌త్‌ను రూపొందించడంలో యువత కీలక పాత్ర పోషించాలని ప్రధాని చేసిన సూచనలను కేంద్ర మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ దిశగా, భారతదేశం నేడు దాదాపు లక్ష స్టార్టప్‌లు, వందకు పైగా యునికార్న్‌లతో సగర్వంగా చెప్పుకోగలిగే మైలురాయిని సాధించడంలో మన యువత ఘనత చాటారని శ్రీ అనురాగ్ ఠాకూర్ అన్నారు.
ఒకవైపు హర్ ఘర్ తిరంగా కోసం ప్రధాని పిలుపునకు దేశం అద్భుతంగా స్పందించిందని, అదే త్రివర్ణ పతాక స్ఫూర్తి ఆపరేషన్ గంగా సమయంలో, ప్రపంచంలోని ఘర్షణలు జరిగే  ప్రాంతం నుండి మన విద్యార్థులు బయట పడవేసింది అని మంత్రి చెప్పారు. సర్వేలు ఆయనను అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా పేర్కొన్నాయని, వాస్తవానికి త్రివర్ణ పతాకాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జెండాగా మన దేశ గౌరవానికి ప్రతీకగా ప్రధాని మార్చారని శ్రీ ఠాకూర్ అన్నారు.

మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర కార్యక్రమ ఇతివృత్తాన్ని, వివరాలను తెలియజేసి అతిథులకు స్వాగతం పలికారు. 

9 సంవత్సరాల ప్రభుత్వ జాతీయ కాన్క్లేవ్ ప్రారంభ సెషన్ తర్వాత మూడు ఇతివృత్తాలతో సదస్సు జరుగుతుంది. 

సెషన్ 1: "ఇండియా: సర్జింగ్ ఎహెడ్" సీనియర్ జర్నలిస్ట్ శ్రీ నితిన్ గోఖలే నిర్వహిస్తారు. ఈ సెషన్ లో పాల్గొనే వారు:

* సునీల్ భారతి మిట్టల్, ఛైర్మన్, వ్యవస్థాపకుడు, భారతి ఎంటర్‌ప్రైజెస్ 

* సంగీతా రెడ్డి, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ 

* దేబ్జానీ ఘోష్, నాస్కామ్ ప్రెసిడెంట్ 

* సుర్జిత్ భల్లా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 

* సౌమ్య కాంతి ఘోష్, గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

* దీపా సాయల్, చీఫ్, ఐడబ్ల్యూఐఎల్ ఇండియా 

 

సెషన్ 2: జన్ జన్ కా విశ్వాస్‌- జర్నలిస్ట్ రిచా అనిరుధ్ మోడరేట్ చేస్తారు. దీనిలో పాల్గొనే వారు... 

  • నవాజుద్దీన్ సిద్దికీ, సినిమా నటుడు 
  • సింథియా మేకేఫ్రె, యూనిసెఫ్ భారత ప్రతినిధి  
  • కిరణ్ మజుందార్ షా, బయో కాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ (వీడియో సందేశం)
  • పద్మశ్రీ శాంతి తెరెసా లక్రా, నర్స్ 
  • నిఖత్ జరీన్, బాక్సర్ 
  • అనిల్ ప్రకాష్ జోషి, పర్యావరణ వేత్త 
  • దివ్య జైన్, సీఖో కో-ఫౌండర్ 

 

సెషన్-3: యువశక్తి - గాల్వనైజింగ్ ఇండియా రౌనాక్ , రేడియో జాకీ , రేడియో ఎఫ్ఎం సంధాన కర్తగా ఉంటారు.. దీనిలో 

  • రితేష్ అగర్వాల్, సీఈఓ ఓయో రూమ్స్ 
  • రిషబ్ షెట్టి, నటుడు 
  • అమాన్ అలీ బంగాశ్, సంగీతకారుడు 
  • వీరేన్ రస్కిన్హ, మాజీ భారత హాకీ కెప్టెన్ 
  • యశోధరా బజోరియా, డైరెక్టర్, ఎస్ప్రెస్సో టెక్నాలజీస్ 
  • అఖిల్ కుమార్, బాక్సర్ 

****



(Release ID: 1927820) Visitor Counter : 121