మంత్రిమండలి
azadi ka amrit mahotsav

డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్థ్ రిసర్చ్ (డిహెచ్ఆర్) కుమరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) కు మధ్య అసిస్టివ్ టెక్నాలజీ పైప్రాజెక్టు సహకారం ప్రధానమైన ఒప్పందం పై సంతకాల కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 17 MAY 2023 4:05PM by PIB Hyderabad

తక్కువ ఖర్చు లో ఉన్నతమైన నాణ్యత తో కూడిన సహాయక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడం కోసం డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్థ్ రిసర్చ్ (డిహెచ్ఆర్) కు మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) కు మధ్య ప్రాజెక్టు సహకారం ప్రధానమైనటువంటి ఒప్పందం పై సంతకాలు అయిన సంగతి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దృష్టి కి తీసుకు రావడమైంది. ఈ ప్రక్రియ లో ముఖ్యం గా పరిశోధన ను, నూతన ఆవిష్కరణల ను సమర్థించడం తో పాటు, సామర్థ్య నిర్మాణం పైన సైతం శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది.

 

ప్రాజెక్టు సహకారం ప్రధానం అయినటువంటి ఒప్పందం (పిసిఎ) పత్రాల పైన 2022 వ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీ నాడు డబ్ల్యుహెచ్ఒ, 2022 వ సంవత్సరం అక్టోబరు 18వ తేదీ న డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్థ్ రిసర్చ్ (డిహెచ్ఆర్) సంతకాలు చేశాయి.

 

అసిస్టివ్ టెక్నాలజీ వినియోగం, పరిశోధన ను, నూతన ఆవిష్కరణలను పెంచుకోవడం మరియు తగినటువంటి శిక్షణ కార్యక్రమాల ను వ్యాప్తి లోకి తీసుకు రావడం వంటి అంశాల లో ప్రపంచ దేశాల దృష్టి ని ఆకర్షించే దిశ గా కృషి చేయడం ఈ సహకారం యొక్క ప్రధానోద్దేశ్యాలు గా ఉన్నాయి.

 

**


(Release ID: 1924966) Visitor Counter : 177