ప్రధాన మంత్రి కార్యాలయం
రోజ్ గార్ మేళా లో భాగం గా, ప్రభుత్వ విభాగాలు మరియు సంస్థల లో క్రొత్త గా ఉద్యోగాల లో నియమించినవ్యక్తుల కు దాదాపు గా 71,000 నియామక లేఖల ను మే నెల 16వ తేదీ నాడు పంపిణీ చేయనున్న ప్రధాన మంత్రి
Posted On:
15 MAY 2023 11:41AM by PIB Hyderabad
ఉద్యోగాల లో క్రొత్త గా నియమించిన వారికి దాదాపు గా 71,000 నియామక లేఖల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 సంవత్సరం లో మే నెల 16వ తేదీ నాడు ఉదయం పూట 10:30 గంటల కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా పంపిణీ చేయనున్నారు. ఉద్యోగ నియామకం జరిగిన వ్యక్తుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రసంగించనున్నారు.
రోజ్ గార్ మేళా ను దేశ వ్యాప్తం గా 45 చోట్ల నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజ్ గార్ మేళా కార్యక్రమం లో భాగం గా నియామకాలు వివిధ కేంద్ర ప్రభుత్వాల విభాగాల తో పాటు ఈ కార్యక్రమాని కి సమర్ధన ను అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల లో/కేంద్రపాలిత ప్రాంతాల లో చోటు చేసుకొంటున్నాయి. దేశ వ్యాప్తం గా క్రొత్త గా నియామకం జరిగిన వారు గ్రామీణ డాక్ సేవక్ , ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోస్ట్ స్, కమర్శియల్-కమ్-టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్, జూనియర్ అకౌంట్స్ క్లర్క్, ట్రాక్ మెయింటెనర్, అసిస్టెంట్ సెక్శన్ ఆఫీసర్, లోయర్ డివిజన్ క్లర్క్, సబ్ డివిజనల్ ఆఫీసర్, టాక్స్ అసిస్టెంట్స్, అసిస్టెంట్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్, ఇన్స్ పెక్టర్ స్, నర్సింగ్ ఆఫీసర్ స్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ స్, ఫైర్ మన్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, డివిజనల్ అకౌంటెంట్, ఆడిటర్, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, అసిస్టెంట్ కమాండాంట్, ప్రిన్సిపల్, ట్రయిన్డ్ గ్రాడ్యుయట్ టీచర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ వంటి పదవుల లో చేరనున్నారు.
ఉద్యోగాల కల్పన కు అత్యున్నత ప్రాధాన్యాన్ని ఇచ్చే విషయం లో ప్రధాన మంత్రి యొక్క వచన బద్ధత ను నెరవేర్చే దిశ లో రోజ్ గార్ మేళా ఒక అడుగు గా ఈ ఉంది. ఉద్యోగాల కల్పన ను పెంపొందించడం తో పాటు గా యువతీ యువకుల కు సాధికారిత కల్పన మరియు దేశం యొక్క అభివృద్ధి లో పాలుపంచుకొనే అవకాశాల ను వారికి అందించడం లో రోజ్ గార్ మేళా ఒక ఉత్ప్రేరకం కాగలదన్న ఆశ ఉంది.
క్రొత్త గా ఉద్యోగాల లో నియామకం జరిగిన వారు ‘కర్మయోగి ప్రారంభ్’ ద్వారా వారంతట వారు గా శిక్షణ ను పొందే అవకాశాన్ని దక్కించుకొంటారు. ‘కర్మయోగి ప్రారంభ్’ అనేది ప్రభుత్వం లో వేరు వేరు విభాగాల లో క్రొత్త గా నియామకం జరిగిన వారి కి ఉద్దేశించిన ఆన్ లైన్ ఓరియంటేశన్ కోర్సు.
***
(Release ID: 1924147)
Visitor Counter : 220
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam