ప్రధాన మంత్రి కార్యాలయం

‘మన్ కీ బాత్’ పై జపాన్ దౌత్యకార్యాలయం యొక్క సందేశాని కి సమాధానాన్ని ఇచ్చిన ప్రధాన మంత్రి

Posted On: 03 MAY 2023 7:57PM by PIB Hyderabad

‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) తాలూకు వందో భాగాన్ని గురించి భారతదేశం లోని జాపాన్ దౌత్య కార్యాలయం ట్వీట్ చేసింది. ఈ సందర్భం లో శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తూ, దౌత్య కార్యాలయం ‘మన్ కీ బాత్: ఎ సోషల్ రివల్యూశన్ ఆన్ రేడియో’ శీర్షిక తో వెలువడ్డ ఒక పుస్తకాని కి జపాన్ ప్రధాని కీర్తిశేషుడు శ్రీ శింజో ఆబే వ్రాసిన ‘ముందుమాట’ లో ఇచ్చిన సందేశాన్ని స్మరించింది.

 

‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) తాలూకు 89 వ భాగాన్ని కూడా దౌత్య కార్యాలయం గుర్తు కు తీసుకు వచ్చింది. ఆ భాగం లో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాపాన్ కళాకారుల ను గురించి ఉదాహరిస్తూ భారతదేశం-జాపాన్ సాంస్కృతిక సంబంధాల ను ప్రశంసించారు. జాపాన్ కు చెందిన కళాకారులు ఆ కాలం లో ఆసియా దేశాల లో మహాభారతం , రామాయణం ల తాలూకు నాటక ప్రదర్శనల లో పాలుపంచుకొన్నారు.

ఈ ట్వీట్ లకు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘మీ వినమ్రమైనటువంటి పలుకుల కు మరియు నా మిత్రుడు కీర్తిశేషుడు శ్రీ శింజో ఆబే ను స్మరించినందుకు ధన్యవాదాలు.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS



(Release ID: 1921873) Visitor Counter : 125