ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ ప్రకాశ్ సింహ్ బాదల్ కన్నుమూత పట్లసంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
25 APR 2023 9:40PM by PIB Hyderabad
పంజాబ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ ప్రకాశ్ సింహ్ బాదల్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో,
ప్రకాశ్ సింహ్ బాదల్ గారి కన్నుమూత వార్త తెలిసి తీవ్ర దుఃఖాని కి లోనయ్యాను. భారతదేశ రాజకీయాల లో ఆయన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అని చెప్పాలి, అంతేకాకుండా మన దేశం యొక్క ప్రజల కు గొప్ప తోడ్పాటు ను అందించిన ఒక ముఖ్య రాజనీతికుశలుడు కూడా ను. పంజాబ్ యొక్క ప్రగతి కోసం ఆయన అలుపెరుగక పరిశ్రమించడం తో పాటు గా కఠిన కాలాల్లో రాష్ట్రాని కి అండ గా కూడా నిలచారు.
శ్రీ ప్రకాశ్ సింహ్ బాదల్ కన్నుమూత నాకు వ్యక్తిగతం గా కలిగినటువంటి ఒక లోటు గా ఉన్నది. ఆయన తో అనేక దశాబ్దాల పాటు నేను సన్నిహితం గా నడుచుకొన్నాను. అంతేకాదు, ఆయన నుండి చాలా నేర్చుకొన్నాను కూడా. మా అసంఖ్యక సంభాషణ లు నాకు గుర్తు కు వస్తున్నాయి. ఆ యా సంభాషణల లో ఆయన యొక్క ప్రజ్ఞ సదా స్పష్టం గా కనిపిస్తూ ఉండేది. ఆయన కుటుంబాని కి మరియు లెక్కపెట్టలేనంత మంది ఆయన అభిమాన వర్గాల కు ఇదే సంతాపం.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1919847)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam