ప్రధాన మంత్రి కార్యాలయం
ధరిత్రి దినోత్సవం నేపథ్యంలో మెరుగుకు కృషి చేస్తున్నవారికి ప్రధానమంత్రి ప్రశంస
Posted On:
22 APR 2023 9:19AM by PIB Hyderabad
ధరిత్రి దినోత్సవం సందర్భంగా భూగోళంపై పరిస్థితుల మెరుగుకు అవిరళ కృషి చేస్తున్న ప్రతి ఒక్కరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“ఇవాళ ధరిత్రి దినోత్సవం.. ఈ సందర్భంగా మన భూగోళంపై పరిస్థితులను చక్కదిద్దడానికి కృషిచేస్తున్న వారందరినీ అభినందిస్తున్నాను. ప్రకృతితో సామరస్యంగా జీవించడం మన సంస్కృతిలో అంతర్భాగం. దీనికి అనుగుణంగా సుస్థిర ప్రగతి ప్రయాణం సాగించేందుకు భారతదేశం సదా నిబద్ధతతో ఉంటుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/TS
(Release ID: 1918780)
Visitor Counter : 208
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam