ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పిటిపి-ఎన్ఇఆర్ ఒక చక్కనైనటువంటి పథకం, దేశం లోని ఈశాన్య ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన చేతివృత్తుల వారి జీవనం లో మెరుగుదల ను తీసుకొనిరావాలన్నదేఈ పథకం యొక్క ఉద్దేశ్యం: ప్రధాన మంత్రి

Posted On: 19 APR 2023 3:13PM by PIB Hyderabad

దేశం లో ఈశాన్య ప్రాంతం లోని ఆదివాసి ఉత్పాదన ల వ్యాప్తి కై మార్కెటింగ్ మరియు లాజిస్టిక్స్ అభివృద్ధి (ప్రమోశన్ ఆఫ్ ట్రైబల్ ప్రాడక్ట్ స్ ఫ్ఱమ్ నార్థ్ ఈస్టర్న్ రీజియన్.. పిటిపి-ఎన్ఇఆర్) అనేది ఒక గొప్ప పథకం. ఈశాన్య ప్రాంతాల కు చెందిన ప్రతిభావంతులు అయిన చేతివృత్తుల వారి జీవనాన్ని మెరుగు పరచాలి అన్నది ఈ పథకం యొక్క లక్ష్యం గా ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ పథకం ఈశాన్య ప్రాంత ఉత్పాదన లు విరివి గా లభ్యం అయ్యేటట్లు కూడా దోహద పడనుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఆదివాసి వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అర్జున్ ముండా కొన్ని ట్వీట్ లలో ఆదివాసి చేతివృత్తుల వారి బ్రతుకు తెరువు అవకాశాల ను బలోపేతం చేయాలి అనేది పిటిపి-ఎన్ఇఆర్ పథకం యొక్క ఉద్దేశ్యం, ఈ లక్ష్య సాధన కు గాను సంబంధిత ఉత్పాదన ల కొనుగోలు, లాజిస్టిక్స్, ఇంకా మార్కెటింగ్ పరం గా దక్షత ను పెంచివేయడం జరుగుతుంది అని తెలియ జేశారు.

కేంద్ర మంత్రి ట్వీట్ లకు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -

‘‘పిటిపి-ఎన్ఇఆర్ ఒక చక్కనైనటువంటి పథకం, దీని ఉద్దేశ్యమల్లా ఈశాన్య ప్రాంత చేతివృత్తుల వారి యొక్క జీవనాన్ని మెరుగు పరచడమే. ఈ పథకం ఈశాన్య ప్రాంత ఉత్పాదన లు మరింత ఎక్కువ గా అందుబాటు లోకి వచ్చేటట్లు చూడడం. దీనితో ఆదివాసి సముదాయాల కు విశేష ప్రయోజనం సిద్ధిస్తుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 


(Release ID: 1918101)